
📌 Key Points
- ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ జంటగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ విడుదల కాబోతోంది!
- సెట్‌లో తరుణ్‌ను కొట్టిన ఈషా.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం తీర్చుకుందట!
- ఈషా, తరుణ్ మధ్య కెమిస్ట్రీ అదిరిందట.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉంటుందని వెల్లడి
- మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఈషా.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిందని సమాచారం!
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈషా రెబ్బా.. తరుణ్ భాస్కర్‌ను కొట్టిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!
తరుణ్‌పై ఈషా ప్రతీకారం.. అసలేం జరిగిందంటే?
తెలుగు అందం ఈషా రెబ్బా కొంత గ్యాప్ తో ఇప్పుడు `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించింది. తరుణ్ భాస్కర్ హీరోగా, ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సృజన్ ఎరబోలు, అనూప్ చంద్రశేఖర్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో హీరోయిన్ ఈషా రెబ్బా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సెట్‌లో హీరో తరుణ్ భాస్కర్ తన చెంప చెల్లుమనిపిస్తే, తాను కూడా ఆయన చెంప చెల్లుమనిపించిందట. ఆ విషయాలను షేర్ చేసుకుంది.
`ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ భార్యాభర్తల మధ్య జరిగే కథ. ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది. పాత్రల మధ్య సీరియస్‌నెస్ నుంచి ఫన్ జనరేట్ అవుతుంది. అదే సినిమాకి పెద్ద అసెట్. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ క్రమంలో ఈ మూవీలోని తరుణ్ భాస్కర్ ని చెంపదెబ్బ కొట్టే సన్నివేశాల గురించి ఈషా రెబ్బా ఓపెన్ అయ్యింది. సోమవారం ఆమె మీడియాతో ముచ్చటిస్తూఈ విషయాలను పంచుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ ని కొట్టాల్సి ఉంటుంది. ఓ సన్నివేశంలో పిండి హీరోయిన్ చెంపకి అంటాలి. అది అంటుకోవడం లేదు, దీంతో గట్టిగానే కొట్టాల్సి వచ్చిందట. తరుణ్ కొట్టడంతో తన చెంపకి దెబ్బ తగిలి నొప్పి వచ్చిందని, దీంతో కన్నీళ్లు వచ్చాయని, నిజంగానే ఆయా సీన్ లో ఏడ్చినట్టు తెలిపింది ఈషా.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఈషా.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది!
అంతేకాదు ఇలాంటి సన్నివేశం తరుణ్ భాస్కర్‌పై కూడా ఉందట. తాను నెమ్మదిగా కొడితే పిండి అంటుకోవడం లేదని, తాను కూడా గట్టిగానే కొట్టిందట. దీంతో తరుణ్‌కి కూడా దెబ్బతగిలిందని, ఆయనకు కూడా నొప్పి వచ్చిందని చెప్పింది. మొత్తంగా తనని కొట్టినందుకు తరుణ్ భాస్కర్‌పై ఈషా కూడా ప్రతీకారం తీర్చుకుందని చెప్పొచ్చు. అయితే ఇదంతా తమ మధ్య సరదాగా సాగిందని తెలిపింది ఈషా. ఈ మూవీ కోసం తాను కొంత వరకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుందట. బేసిక్ మెలకువలు నేర్చుకున్నట్టు చెప్పింది. మొత్తంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తరుణ్‌ని కొట్టిందని చెప్పొచ్చు.
తనకు యాక్షన్ చేయడమంటే ఇష్టమని, ఈ సినిమా ఒప్పుకోవడానికి అది కూడా ఓ కారణమని తెలిపింది. అయితే ఎవరినైనా బాగా కొట్టాలని ఉంటుందని, కానీ ఆ అవకాశం రావడం లేదని(నవ్వుతూ) చెప్పింది ఈషా. సినిమా ఆద్యంతం ఫన్సీగా సాగుతుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని, ప్రతి ఒకరు రిలేట్ అవుతారని తెలిపింది. గోదావరి యాసలో మాట్లాడటం పెద్ద సమస్య కాలేదని, అమ్మది రాజమండ్రి కావడంతో, హాలీడేస్ కి అక్కడికి వెళ్లేదట. అలా ఆ యాసపై పట్టు వచ్చిందని చెప్పింది. తరుణ్ మాత్రం గోదావరి యాస కోసం కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. ఈమూవీ మలయాళంలో వచ్చిన `జయ జయ జయ జయహే` కి రీమేక్. కాకపోతే తెలుగులో చాలా మార్పులు చేశారని, మన తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని చెప్పింది.
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయట!
ఇక తనకెరీర్ గురించి చెబుతూ, ఇటీవల కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే అని, బలమైన కథ, సినిమాలో తన పాత్రకి ప్రయారిటీ ఉంటుందని, నమ్మకం కలిగిన తర్వాతనే సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది. అందుకే గ్యాప్ వచ్చినట్టు పేర్కొంది. ఒకప్పుడు తెలుగుఅమ్మాయిలకు ఆఫర్లు వచ్చేవి కావు, కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక అవకాశాలు పెరిగాయి. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పింది ఈషా. తాను కూడా సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు పేర్కొంది. అదే సమయంలో `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ తనకు వ్యక్తిగతంగా చాలా హెల్ప్అవుతుందని, తన కెరీర్ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపింది.
ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈషా, తరుణ్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


