|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ డైరెక్టర్ తో ఈషా రెబ్బ రిలేష‌న్‌..? ఇదిగో ఫోటోలు

Published: 21-10-2025, 2:19 AM
ఆ డైరెక్టర్ తో ఈషా రెబ్బ రిలేష‌న్‌..? ఇదిగో ఫోటోలు

తెలుగు నటి ఈషా రెబ్బ గురించి ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. దీపావళి వేడుకల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి కనిపించిన ఈషా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

Key Points

1

తెలుగు నటి ఈషా రెబ్బ సినీ ప్రస్థానం.

2

విశ్వక్ సేన్ ఇంట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బ దీపావళి.

4

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ కొత్త సినిమా చేసే అవకాశం.

ఈషా రెబ్బ కెరీర్ సంగతులు

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ‌ గురించి తెలియని వారు ఉండరు. 2012 సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో మెరిసిన ఈ అందాల తార పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఛాన్స్ కొట్టేసింది. పెద్ద హీరోయిన్ గా పేరు సక్సెస్ కాలేకపోతున్న ఈశా రెబ్బ, చిన్న పాత్రలు వచ్చినా చేస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలలో సైడ్ హీరోయిన్ పాత్రలు చేసి మెప్పించింది. అయితే అలాంటి ఈషా రెబ్బ‌ ఈ మధ్యకాలంలో పిట్టకథలు, 3రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈషా రెబ్బ‌ గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

దీపావళి సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బ‌ మెరిశారు. దీపావళి టపాకాయలు పేల్చుతూ సందడి చేశారు. విశ్వక్ సేన్‌ ఇంట్లో ఈ దీపావళి వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వక్ సేన్‌ ఇంటికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ‌ కలిసి వెళ్లారు. దీంతో వీళ్లిద్దరూ క్లోజ్ గా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే త‌రుణ్‌, ఈషా రెబ్బ‌ మధ్య రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని మ‌రికొంద‌రు అంటున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ‌ త్వరలో కొత్త సినిమా చేయబోతున్నారని, అందుకే అతనితో వెళ్ళినట్లు చెబుతున్నారు. క్లిక్

తరుణ్ భాస్కర్‌తో దీపావళి సందడి

రిలేషన్ షిప్ నిజమేనా? కొత్త సినిమా కోసమేనా?

తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బ రిలేషన్ షిప్ పై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమా, లేక కొత్త సినిమా కోసమేనా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.