
📌 Key Points
- ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ రిలేషన్ పై సోషల్ మీడియాలో వార్తలు.
- గతంలో తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నానంటూ చేసిన వ్యాఖ్యలు.
- పెళ్లి పుకార్లపై ఈషా రెబ్బా ఫన్నీ వీడియోతో స్పందన.
- ‘కాలమే నిర్ణయిస్తుంది’ అంటూ ఆమె పరోక్షంగా సమాధానం.
నటి ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్‌ల పెళ్లి పుకార్లు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈషా రెబ్బా ఈ వార్తలపై స్పందిస్తూ, ‘ఏ పనులు ఎప్పుడు జరగాలో కాలమే నిర్ణయిస్తుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత సస్పెన్స్‌ను పెంచాయి.
తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బా రిలేషన్‌షిప్ పుకార్లు
Eesha Rebba: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న వారిలో ఈషా రెబ్బా(Eesha Rebba) ఒకరు. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈశా రెబ్బ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి (Om Shanti Shanti Shanti)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇద్దరు గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి జంటగా కనిపించడం , తరుణ్ భాస్కర్ తాను ప్రేమలో ఉన్నానని త్వరలోనే చెబుతానంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ఈ ఇద్దరి రిలేషన్ కు మరింత బలం చేకూర్చాయి. ఈ తరుణంలోనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టారనే చెప్పాలి.
పెళ్లి వార్తలపై ఈషా రెబ్బా షాకింగ్ సమాధానం
తరుణ్ భాస్కర్ తో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఈమె పరోక్షంగా స్పందిస్తూ..” ఏ పనులు ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతాయి, కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడంతో వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమేనని, అందుకే ఈమె ఈ వార్తలను ఖండించకుండా కాలమే నిర్ణయిస్తుంది అంటూ సమాధానం ఇచ్చారని భావిస్తున్నారు.
?igsh=MTV3dGJhcWQ2dHB2Mg%3D%3D
కలిసి నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా
ఇక వీరిద్దరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలు పట్ల క్లారిటీ రావాలి అంటే అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఈషా రెబ్బ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఓం శాంతి శాంతి అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా2026, జనవరి 23 వతేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న జయ జయ జయహే సినిమా రీమేక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాకు ఏ ఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. మరి సూపర్ హిట్ రీమేక్ సినిమా ద్వారా రాబోతున్న ఈ జంట ఎలాంటి సక్సెస్ అందుకుంటారు తెలియాల్సి ఉంది.
ఈషా రెబ్బా ‘కాలమే నిర్ణయిస్తుంది’ అనడంతో పెళ్లి వార్తలపై స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ పుకార్లపై సస్పెన్స్ కొనసాగుతుంది. అభిమానులు మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.


