|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుడ్ల డ్రెస్: ఫ్యాషన్ వింత పోకడ! వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే షాక్!

Published: 04-04-2026, 9:05 AM
గుడ్ల డ్రెస్: ఫ్యాషన్ వింత పోకడ! వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే షాక్!
  • ఫ్యాషన్ ప్రపంచంలో వింత పోకడలు సాధారణం కాగా, గుడ్లు, ఎగ్ ట్రేలతో డ్రెస్ వైరల్ అయింది.
  • మోడల్ ఎగ్ ట్రేలతో చేసిన డ్రెస్, షోల్డర్ ప్యాడ్స్, ఇయర్ రింగ్స్‌తో దర్శనమిచ్చింది.
  • ఒక ఫోటోలో మోడల్ భుజంపై నిజమైన కోడిని కూర్చోబెట్టుకుని ఫోజులిచ్చింది.
  • నెటిజన్లు ఈ డ్రెస్సును ఫ్యాషనా లేక పిచ్చా అని ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుంది. తాజాగా ఒక మోడల్ గుడ్లు, ఎగ్ ట్రేలతో చేసిన డ్రెస్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎగ్ ట్రేలు, గుడ్లతో వింత డ్రెస్

ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి వింత ట్రెండ్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇంటర్నెట్ పుణ్యమా అని రోజూ ఎన్నో వెరైటీ డ్రెస్సులు చూస్తూనే ఉన్నాం. కానీ, తాజాగా ఒక మోడల్ వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. అసలు ఇది ఫ్యాషనా లేక పిచ్చా? అని తలలు పట్టుకుంటున్నారు.

కోడితో ఫోజులిచ్చిన మోడల్

సాధారణంగా బట్టలు డిజైన్ చేయడానికి రకరకాల ఫ్యాబ్రిక్స్ వాడతారు. కానీ, ఈ వైరల్ ఫొటోల్లో ఉన్న మోడల్ ఏకంగా ఎగ్ ట్రేలు (గుడ్ల అట్టలు), కోడిగుడ్లతో తయారు చేసినట్లుగా భారీ కోట్ లాంటి డ్రెస్ వేసుకుంది. పైగా ఆ డ్రెస్ కు పెద్ద షోల్డర్ ప్యాడ్స్, చెవులకు ఎగ్ ట్రేలతోనే చేసిన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చూస్తుంటే ఏకంగా ఓ కోడిగుడ్ల షాపును ఒంటికి అతుక్కున్నట్లుగా ఉందంటూ నెటిజన్‌లు ఆశ్చర్యపోతున్నారు. అని నిజమైన కోడి గుడ్లు కాకపోవచ్చని, ప్లాస్టిక్ గుడ్లు ఉండొచ్చని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల విస్మయం, కామెంట్స్

గుడ్లతో డ్రెస్ వేసుకోవడమే వింత అనుకుంటే.. మరో ఫొటోలో ఏకంగా ఓ బతికున్న కోడిని తీసుకొచ్చి తన భుజం మీద (డ్రెస్ ప్యాడ్స్ పై) కూర్చోబెట్టుకుని సీరియస్‌గా ఫోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ‘కోడిగుడ్ల డ్రెస్’ చూసిన ఒక నెటిజన్ ‘Is this fashion or nonsense?’ అంటూ ఫొటోలు పోస్ట్ చేశారు. మరికొందరు కామెంట్స్ సెక్షన్‌లో తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఇదేక్కడి డ్రెస్ రా బాబు… దారిలో ఎవరైనా ఢీ కొడితే ఆమ్లెట్ అయిపోవడం ఖాయం అంటూ కామెంట్ పెట్టారు. కోడిగుడ్ల రేట్లు పెరిగినప్పుడు బయట ఇలా తిరిగితే సేఫ్ కాదు భయ్యా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. చాలా మంది ఇది ఏఐతో రూపొందించిన ఫోటో అని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ ఫొటోలను నెటిజన్లు ట్రెండింగ్ లోకి తెచ్చారు.

ఏది ఏమైనా ఈ ‘కోడిగుడ్ల డ్రెస్’ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి వింతలు చూస్తూనే ఉంటాం. ఈ డ్రెస్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.