
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. కెప్టెన్సీ టాస్క్‌లో రమ్య గాయపడగా, కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఇమ్మాన్యుయల్, తనూజను వదిలి రమ్య వెంట పడుతూ కొత్త రొమాన్స్ యాంగిల్ సృష్టిస్తున్నాడు. ఈ వారం బిగ్ బాస్ ఇంటిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చదవండి.
Key Points
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ మరింత రణరంగంగా మారింది.
కెప్టెన్సీ టాస్క్‌లో గోల్డ్ గేమ్‌లో రమ్య తలకు గాయం, ఆట నుండి వైదొలిగింది.
వైలెన్స్‌పై తనూజ, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇమ్మాన్యుయల్ తనూజను వదిలి రమ్య వెంట పడుతూ హౌస్‌లో ఫన్ క్రియేట్ చేశాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ రణరంగం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకీ మరింత దారుణంగా తయారు అవుతోంది. మిగతా సీజన్లతో పోలిస్తే ఈసీజన్ నిజంగానే రణరంగంలా మారింది. ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ కలగలిపి ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ మరిత వైల్డ్‌గా మారుతోంది.మరీ ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి వచ్చిన తరువాత టాస్క్ లు , నామినేషన్ల తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గేమ్‌లో గెలవాలనే తపనతో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అటు మాధురి ఏమాత్రం తగ్గడంలేదు. తాజా ఎపిసోడ్ లో కూడా మాధురి, రీతూమధ్య మాటల యుద్దం జరిగింది.
తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఓ వైల్డ్ గేమ్ ఇచ్చిన బిగ్ బాస్, కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో నిర్వహించిన ఈ గోల్ టాస్క్‌లో కంటెస్టెంట్లు బంతిని తమ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌లో వేసే ప్రయత్నం చేశారు. అయితే ఆట మొదలైన కాసేపటికే అది పూర్తిగా ఫిజికల్‌గా మారింది. గేమ్‌లో భాగంగా భరణిని అదుపు చేసే సమయంలో రమ్య కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు గట్టిగా తగలడంతో వెంటనే ఆమె ఆట నుంచి వైదొలిగింది. ఈ గాయం కారణంగా మిగతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు టాస్క్‌లో ఉన్న తోపులాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై తనూజ స్పందిస్తూ, వైలెన్స్ మొదలుపెట్టింది మీరు కదా” అంటూ కౌంటర్ ఇచ్చింది.
కెప్టెన్సీ టాస్క్‌లో రమ్యకు గాయం
కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి, మొదటగా ఈ వారమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చారు. అయితే చివర్లో బిగ్ బాస్ కీలక ట్విస్ట్ ఇచ్చాడు – కెప్టెన్సీ కంటెండర్షిప్‌ను కాపాడుకోవడం కూడా వారి బాధ్యతే అని అన్నాడు. అంటే మిగతా ఇంటి సభ్యులూ ఆటలో భాగమని స్పష్టం చేశారు. ఈ టాస్క్ చివరికి ముగ్గురు కంటెస్టెంట్లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో సుమన్, గౌరవ్, గత వారం నాగార్జున ఇచ్చిన పవర్ ద్వారా నిఖిల్ కూడా ఈ పోటీలో చేరారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపిక కానున్నారు.
ఇమ్మాన్యుయల్ మనసు మార్పు: తనూజ నుండి రమ్య వైపు
బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు జరిగినా..ఫన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు ఇమ్మాన్యుయేల్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనసు కూడా దోచుకున్నాడు ఇమ్ము. గతంలో తనజా వెంట పడ్డ ఇమ్మాన్యుయేల్.. తాజాగా రమ్యా వెంట పడుతున్నాడు. అపరిచితుడులో రాములా మారిపోయి.. రమ్యతో చిన్న స్కిట్ ప్లే చేశాడు. రాము చేసిన పెర్పామెన్స్ కు అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు, ఏడుపుల నుంచి ఇమ్మాన్యుయేల్ కామెడీ ఆడియన్స్ ను కాస్త కాపాడిందని చెప్పవచ్చు.
బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌ల రాకతో డ్రామా, గొడవలు తారస్థాయికి చేరాయి. కెప్టెన్సీ టాస్క్, ఇమ్మాన్యుయల్ ప్రేమ వ్యవహారాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఇంట్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చూడొచ్చు.


