|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్ 9 ట్రోఫీ ఇమ్మాన్యుయెల్ చేజారింది! చేసిన ఆ ఒక్క పొరపాటే కొంప ముంచిందా?

Published: 23-12-2025, 8:04 AM
బిగ్‌బాస్ 9 ట్రోఫీ ఇమ్మాన్యుయెల్ చేజారింది! చేసిన ఆ ఒక్క పొరపాటే కొంప ముంచిందా?
  • బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల నిలిచారు.
  • ఆల్ రౌండర్‌గా, బలమైన కంటెస్టెంట్‌గా ఇమ్మాన్యుయెల్ టాప్ 3లో నిలుస్తాడని భావించారు.
  • అనూహ్యంగా ఇమ్మాన్యుయెల్ నాలుగో స్థానంలోనే ఎలిమినేట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది.
  • ఎక్కువ వారాలు నామినేషన్లలో లేకపోవడమే ఓటింగ్ తగ్గి, ట్రోఫీ మిస్ అవ్వడానికి ప్రధాన కారణం.

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ పూర్తై కళ్యాణ్ పడాల విజేతగా నిలిచారు. అయితే, టైటిల్ గెలుస్తాడని భావించిన ఇమ్మాన్యుయెల్ నాలుగో స్థానానికే పరిమితం కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇమ్మాన్యుయెల్ ట్రోఫీని ఎందుకు మిస్ అయ్యాడో తెలుసుకోండి.

బిగ్‌బాస్‌లో ఇమ్మాన్యుయెల్ బలమైన కంటెస్టెంట్!

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ప్రారంభంతో పోల్చితే ఎండింగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎంగేజ్‌ చేసింది. రోజు రోజుకి ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. మొత్తంగా ఈ 9వ సీజన్‌ పూర్తయ్యింది. సైనికుడు కళ్యాణ్‌ పడాల విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఈ సారి కూడా కామన్‌ మ్యాన్‌ బిగ్‌ బాస్‌ కప్‌ని ఎగరేసుకుపోయాడు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, భరణి వంటి వారిని కాదని కళ్యాణ్‌కి బిగ్‌ బాస్‌ టైటిల్‌ దక్కడం విశేషం.

ఇదిలా ఉంటే ముందు నుంచి ఇమ్మాన్యుయెల్ కి ఛాన్స్ ఉందని, ఆయన విన్నర్‌ అయ్యే అవకాశం ఉందని భావించారు. చాలా వరకు ప్రచారం జరిగింది. అంతేకాదు ఇమ్మాన్యుయెల్‌ ఆల్‌ రౌండర్‌గా వ్యవహరించారు. టాస్క్ ల్లో దుమ్ములేపాడు, ఎంటర్‌టైన్‌ చేయడంలో ముందున్నాడు, రెండు సార్లు కెప్టెన్‌ అయ్యాడు. కామెడీ చేయడంలో ముందున్నాడు. అందరితోనూ బాగున్నాడు, తన వాయిస్‌ని స్ట్రాంగ్‌గా వినిపించాడు. వాదించే విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. బాండింగ్‌లోనూ ముందున్నాడు. ఇలా అన్ని రకాలుగా మెప్పించాడు ఇమ్మాన్యుయెల్‌.

అనూహ్యంగా నాల్గో స్థానంతో నిరాశ!

దీంతో ఈ సారి ఇమ్మాన్యుయెల్‌కి కప్‌ గ్యారంటీ అనుకున్నారు. గతంలో ఏ కామెడీ కంటెస్టెంట్ లేని విధంగా ఇమ్మాన్యుయెల్‌ ఆకట్టుకోవడం, పైగా ఆల్‌ రౌండర్‌గా ఉండటంతో ఆయనకు విన్నింగ్‌ ఛాన్స్ ఉందని భావించారు. ఆయనలా హౌజ్‌లో మరెవ్వరూ లేరని చెప్పొచ్చు. అయినా కప్‌ దక్కలేదు. పైగా దారుణమైన అవమానం జరిగింది. నాల్గో స్థానంలో ఆయన్ని హౌజ్‌ నుంచి పంపించారు. దీంతో చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు, మాజీ కంటెస్టెంట్లు కూడా విమర్శలు చేశారు. ఇమ్మాన్యుయెల్‌కి తీరని అన్యాయం చేశారని బహిరంగంగానే కామెంట్లు చేశారు.

అయితే ఇమ్మాన్యుయెల్‌ విన్నర్‌ కాకపోవడానికి, ఆ రేసులో లేకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో ఇమ్మాన్యుయెల్‌ వెనబడిపోయాడట. బిగ్‌ బాస్‌ టీమ్‌ నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు ఇమ్మాన్యుయెల్‌ చాలా వారాలు నామినేషన్లో లేడు. దీంతో ఆయనకు ఆడియెన్స్ నుంచి ఓటింగ్‌ బిల్డ్ కాలేదట. తనూజ, డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌ ఆల్మోస్ట్ ఒకటి రెండు వారాలు తప్పా, మిగిలిన అన్ని వారాలు నామినేషన్‌లో ఉన్నారు. దీంతో అది వారికి ప్లస్‌ అయ్యింది. అదే ఇమ్మాన్యుయెల్‌కి మైనస్‌ అయ్యిందట.

ఇమ్మాన్యుయెల్ ట్రోఫీ మిస్: కారణం ఓటింగ్ స్ట్రాటజీ?

దీనికితోడు స్టాండ్‌ తీసుకోవాల్సిన సమయంలో ఆయన సరిగ్గా స్టాండ్‌ తీసుకోలేకపోయాడని, కాస్త డబుల్‌ గేమ్‌ ఆడినట్టుగా వ్యవహరించాడని అంటున్నారు. ఇమ్మాన్యుయెల్‌ చేసిన మేజర్‌ మిస్టేక్‌ ఇదే అని తెలుస్తోంది. స్టాండ్‌ తీసుకోకపోవడం, నామినేషన్స్ లో లేకపోవడం అనే కారణాలతో ముందుగానే తప్పించినట్టు సమాచారం. అదే సమయంలో కళ్యాణ్‌కి భారీగా ఓటింగ్‌ పడిందట. దీంతో తాము అనుకున్న కంటెస్టెంట్ ని కాదని కళ్యాణ్‌ని విన్నర్‌ని చేయాల్సి వచ్చిందని బిగ్‌ బాస్‌ నిర్వాహకుల నుంచి వినిపిస్తున్న మాట. ఏదేమైనా మరోసారి కామన్‌ మ్యాన్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌ కావడం విశేషం.

బిగ్‌బాస్ ట్రోఫీ చేజారినప్పటికీ, ఇమ్మాన్యుయెల్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. సరైన సమయంలో నామినేషన్లలో లేకపోవడం వల్లే విజేత అయ్యే అవకాశం కోల్పోయాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.