|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తనూజతో ప్రేమ వార్తలపై ఇమ్మాన్యుయేల్ సంచలన వివరణ! అసలు నిజం ఇదే!

Published: 28-12-2025, 2:28 AM
తనూజతో ప్రేమ వార్తలపై ఇమ్మాన్యుయేల్ సంచలన వివరణ! అసలు నిజం ఇదే!
  • బిగ్ బాస్ 9 టాప్ 5తో సరిపెట్టుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్.
  • తనూజతో ప్రేమ వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్ ప్రశ్నించారు.
  • తనూజతో కేవలం ‘కుక్ విత్ జాతిరత్నాలు’ షో ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని స్పష్టం చేశాడు.
  • ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం కోసమే ఫ్లర్ట్ డైలాగ్స్ వాడానని వివరించిన ఇమ్మాన్యుయేల్.

బిగ్ బాస్ సీజన్ 9తో ప్రేక్షకులను అలరించిన కమెడియన్ ఇమ్మాన్యుయేల్, హౌస్ బయట తనూజతో ప్రేమ వార్తలపై స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వారిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమేనని, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఫ్లర్టింగ్ డైలాగ్స్ వాడానని స్పష్టం చేశారు.

బిగ్ బాస్ తర్వాత ఇమ్మాన్యుయేల్ ప్రెస్ మీట్

కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షోలో ఎంతగానో నవ్వించిన ఆయనకు బిగ్ బాస్ సీజన్-9‌లో కంటెస్టెంగ్‌గా వెళ్లే అవకాశం వచ్చింది. అలా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ని ఒక రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్కుల్లో కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు.

తనూజతో ప్రేమపై నెటిజన్ ప్రశ్న

దీంతో ఈ సీజన్ విన్నర్ అతనే అన్ని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ, బ్యాడ్ లక్ ఆయన కేవలం టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బయటకు వచ్చాక ఇమ్ము తాజాగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇందులో భాగంగా నెటిజన్స్ అడిగే క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేశారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ తనూజది మీది లవ్ నిజం అనిపించింది.. బయటికి వచ్చాక మీ పిల్లతో ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడుగగా దానికి.. ‘ఛీ ఛీ అలాంటిది ఏమీ లేదు.

ఇమ్మాన్యుయేల్ క్లారిటీ: అసలు నిజం ఏంటి?

హౌస్‌లోకి వెళ్లకముందు నేను తనూజ కలిసి కుక్ విత్ జాతిరత్నాలు షో చేశాము. అందుకే ఆ ఫ్రెండ్షిప్ వల్ల అంతగా క్లోజ్ ఉన్నా అండ్ ఆడియన్స్‌ను ఎంటర్ టైన్ చేయడం కోసమే ఆమెను ఫ్లర్ట్ డైలాగ్స్ వాడాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా , ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ గురించి, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

తనూజతో తన బంధం కేవలం స్నేహం మాత్రమేనని ఇమ్మాన్యుయేల్ తేల్చిచెప్పడంతో, వారిద్దరి ప్రేమపై జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అలా ప్రవర్తించానని ఆయన వివరించడం చర్చనీయాంశమైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.