|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్

Published: 07-12-2025, 8:48 PM
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
  • ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు.
  • జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఇమ్మాన్యుయేల్, సినిమాల్లోనూ నటించారు.
  • వర్ష, ఫైమాతో లవ్ ట్రాక్‌లు జబర్దస్త్ స్కిట్స్‌ కోసమే అని స్పష్టమైంది.
  • ఇమ్మాన్యుయేల్ కాబోయే భార్య ఒక డాక్టర్ అని ఆయన అన్న వంశీ వెల్లడించారు.

జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ప్రేమ జీవితం గురించి చాలా కాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇమ్మాన్యుయేల్‌కు లవర్ ఉందని, ఆమె డాక్టర్ అని ఆయన అన్న వంశీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయేల్ జర్నీ

జబర్దస్త్ ద్వారా ఆడియన్స్ కు బాగా పరిచయమైన కమెడియన్ ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9 లో ఆయన టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అంతే కాదు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి బాగా ఎంటర్టైన్ చేస్తూ.. టాస్క్ లు కూడా అద్భుతంగా ఆడుతూ.. టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. పటాస్ కామెడీ షో ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్‌లో చేసిన స్కిట్స్‌తో మంచి ఫేమ్ సంపాదించాడు. సినిమాల్లో కూడా పలు చిన్నపాటి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ వర్ష, ఫైమాతో చేసిన లవ్ ట్రాక్‌లు జబర్దస్త్ ప్రేక్షకులను అలరించాయి.

జబర్దస్త్ లో వర్ష, ఫైమాతో ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్స్ మూలంగా.. వర్షతో ఆయన లవ్ లో ఉన్నాడని అందరు అనుకున్నారు. దీనికితోడు కావాలని స్కిట్స్ లో వేసే ఎలివేషన్ మ్యూజిక్ లు, సాంగ్స్ తో అందరు వర్షకు, ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఏదో ఉందంటూ.. రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని.. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత తెలిసింది. ఆయన తనకు ఒక లవర్ ఉందని బిగ్ బాస్ హౌస్ లో వెల్లడించాడు. కానీ ఆమె ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే ఇమ్మాన్యుయేల్ కు కాబోయే భార్య గురించి ఆయన అన్న వంశీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు.

వర్ష, ఫైమాతో లవ్ ట్రాక్ నిజం కాదా?

ఇమ్మాన్యుయేల్ అన్న వంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇమ్ము వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మొదటిసారిగా స్పష్టత ఇచ్చారు. వంశీ మాట్లాడుతూ, “ఇమ్మాన్యుయేల్‌కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ ఆమె ఎవరో ఎవరికి తెలీదు. ఆమె ఎవరో నాకు మాత్రమే తెలుసు. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్‌లో ఉన్నాడు కాబట్టి.. సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి ‘ఈమె అతని గర్ల్ ఫ్రెండ్’ అని చెబుతున్నారు. నన్ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. కాని ఆ అమ్మాయికి ఇబ్బంది కాకూడదు అనే ఆమె ఎవరో చెప్పడంలేదు. ఆమె ఒక డాక్టర్.. స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం కోసం బయట ఉంది. ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అనే ఇలా సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నాము” అని వంశీ అన్నారు.

ఇమ్మాన్యుయేల్ లవర్ ఎవరు? అన్న ఏం చెప్పారు?

ఇమ్మాన్యుయేల్ చేసుకోబోయే అమ్మాయి వ్యక్తిగత వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో.. ఆమె గురించి చెప్పడంలేదు. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అతనే ఆమె ఎవరో ప్రకటిస్తాడు. అంతే కాదు అతను రాగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారని కూడా వంశీ చెప్పాడు. ఇక వంశీ చేసిన ఈ కామెంట్స్ తో.. ఇమ్మాన్యుయేల్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. తమ అభిమాన కమెడియన్ త్వరలోనే డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని సంబరపడిపోతున్నారు. శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

ఇమ్మాన్యుయేల్ లవర్ ఒక డాక్టర్ అని స్పష్టమైనప్పటికీ, ఆమె వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు రాగానే స్వయంగా ఇమ్మాన్యుయేల్ ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన అన్న వంశీ తెలిపారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.