
ప్రముఖ నటి కృతి సనన్ తన తాజా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ఒక భావోద్వేగపరమైన ప్రయాణం అని, అది ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె పేర్కొంది.
Key Points
కృతి సనన్ తాజా చిత్రం షూటింగ్ పూర్తయింది.
ఆమె ఈ ప్రాజెక్ట్‌ను భావోద్వేగపూరితమైన ప్రయాణంగా అభివర్ణించింది.
ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ తో పనిచేయడం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి ఆమె ఎదురు చూస్తోంది.
కృతి సనన్ తాజా సోషల్ మీడియా పోస్ట్
హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) సినిమా నేనొక్కడినే తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అటు హిందీలో కూడా జాకీ ప్రొఫ్(Jackie Shroff) కుమారుడు టైగర్ ప్రోఫ్ జంటగా హీరోపంతి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో అవకాశం కొట్టేసింది.
ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. కానీ కృతి సనన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈ బ్యూటీ దోచేయ్, దిల్వాలే, రాప్తా, బరేలీ కి బర్ఫీ, స్త్రీ, లుకా చుప్పి, కలంక్, అర్జున్ పాటియాలా, హౌస్ఫుల్ 4, పానిపట్, పతి పత్నీ ఔర్ వో, మిమీ, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే, హీరోపంతి 2. భేదియా, షెహజాదా, గణపథ్ వంటి సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది. ప్రస్తుతం కూడా కృతి సనన్ సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటోంది.
ఒక భావోద్వేగపూరిత ప్రయాణం ముగింపు
ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ… ఫ్యాన్స్ను అలరిస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ తేరే ఇష్క్ మేలో అవకాశం కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఆనంద్ రాయ్ శైలి నాటకం అద్భతం. ఒక రోలర్ కోస్టర్ రైడ్ అండ్ భావోద్వేగపరంగా, శారీరకంగా అలసిపోయే షెడ్యూల్‌ల మారథాన్ తర్వాత.. మరో అందమైన ప్రయాణం ముగిసింది.. కానీ ఇది నాకు ఎప్పటికీ నిలిచి ఉండే జ్ఞాపకాలు ఇచ్చింది.
సినిమా షూటింగ్ అనుభవం
లవ్ యు గాయస్. @aanandlrai @dhanushkraja #హిమాన్షు శర్మ, @aanandlraiముక్తిని వెతుక్కునే ఈ ప్రయాణంలో నా ఒక చేయి పట్టుకున్నందుకు, మరో చేత్తో చాలా ప్రేమతో నాకు అత్యంత రుచికరమైన ఆహారాన్ని తినిపించినందుకు ధన్యవాదాలు. మీరు దర్శకత్వం వహించిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను సార్. @dhanushkraja నేను పనిచేసిన అత్యుత్తమ.. తెలివైన నటులలో మీరు ఒకరు. మీతో సన్నివేశాలు చేయడం చాలా ఆనందంగా ఉంది మిత్రమా. ఇంకా చాలా కలిసి రావాలి. టచ్‌లో ఉండండి. హిమాన్షుశర్మ మీ అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఈ కథను చెప్పదగినదిగా చేస్తుంది. ప్రపంచం మాతో కలిసి జీవించే వరకు నేను వేచి ఉండలేను. చాలా కష్టపడి పనిచేసిన మొత్తం సిబ్బంది.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’’ అంటూ నటి రాసుకొచ్చింది. instagram link
కృతి సనన్ తన సహనటులు మరియు దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవం గురించి వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించిందని ఆమె తెలిపింది.


