|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Emraan Hasmi: ఇమ్రాన్ ఎవరి గురించి ఇలా అన్నాడు?

Published: 28-10-2025, 9:28 AM
Emraan Hasmi: ఇమ్రాన్ ఎవరి గురించి ఇలా అన్నాడు?

నటీనటుల పనితీరు, సమయపాలన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘ఓజీ’ నటుడు ఇమ్రాన్ హష్మీ కొందరు యాక్టర్లు సెట్‌కు రారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ వ్యాఖ్యలు ఎవరి గురించి అనే దానిపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.

Key Points

1

నటుల పనితీరుపై ఇమ్రాన్ హష్మీ సంచలన వ్యాఖ్యలు.

2

కొందరు నటులు అసలు షూటింగ్‌కు రారని ఆశ్చర్యపరిచాడు.

4

సల్మాన్ లేదా పవన్ కల్యాణ్‌ గురించి కామెంట్స్ చేశాడని నెటిజన్ల చర్చ.

ఇమ్రాన్ హష్మీ సంచలన వ్యాఖ్యలు

రీసెంట్ టైంలో నటీనటుల పనివేళలు, సెట్‌కి సమయానికి రావడం అనే విషయాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అడపాదడపా నటీనటులు, సినీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి నేరుగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ‘ఓజీ’లో విలన్‌గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు నటులు అస్సలు సెట్‌కి రారనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.

యామీ గౌతమ్, టైమ్ మేనేజ్‌మెంట్

అసలు విషయానికొస్తే.. ‘హక్'(HAQ) అనే హిందీ సినిమా చేసిన ఇమ్రాన్ హష్మీ దాని ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహనటి యామీ గౌతమ్‌ని ప్రశంసించాడు. సెట్‌కి సమయానికి వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ కాలంలో కూడా టైమ్‌కి రాని యాక్టర్స్ ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. ‘కొందరు నటులు అసలు సెట్‌కే రారు’ అని కామెంట్స్ చేశాడు.

సల్మాన్, పవన్ కల్యాణ్‌పై చర్చ

అయితే ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. పలువురు నార్త్ నెటిజన్లు సల్మాన్ ఖాన్ గురించి అన్నాడని అంటుండగా.. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ గురించి ఈ కామెంట్స్ చేశాడా అనే సందేహపడుతున్నారు. ఎందుకంటే ‘ఓజీ’లో పవన్ కొన్నిరోజులే షూటింగ్‌కి రాగా మిగిలిన చోట్ల పవన్ డూప్‌ని పెట్టి మేనేజ్ చేశారు. ఇమ్రాన్ గతంలో సల్మాన్‌తో కలిసి ‘టైగర్ 3’ చేశాడు. అప్పుడేమైనా సల్మాన్ సెట్‌కి రాలేదా అని అనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.

ఇమ్రాన్ హష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన ఏ స్టార్ హీరో గురించి ఈ కామెంట్స్ చేశాడు అనేది ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇండస్ట్రీలో సమయపాలన సమస్యపై మరోసారి చర్చ లేవనెత్తింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.