|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేశంలో ఎనర్జీ లాక్‌డౌన్ భయం! ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం!!

Published: 26-03-2026, 2:35 AM
దేశంలో ఎనర్జీ లాక్‌డౌన్ భయం! ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం!!
  • పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
  • భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
  • ప్రజలు పానిక్ బయింగ్ చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది.
  • ‘ఎనర్జీ లాక్‌డౌన్’ పేరుతో ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీని ఫలితంగా ‘ఎనర్జీ లాక్‌డౌన్’ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి?

ఇజ్రాయెల్, అమెరికా vs ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమ ఆసియా (Western Asia)లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా (Fuel supply) వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాలకు అంతరాయం కలుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ‘ఎనర్జీ లాక్‌డౌన్’ అనే పదం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

భారత్‌పై యుద్ధ ప్రభావం

ఆయా దేశాల్లోని ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ విద్యుత్ కొరత ఏర్పడినప్పుడు, వాటి వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విధించే ఆంక్షలే ఎనర్జీ లాక్ డౌన్ (Energy lockdown). ఇందులో భాగంగానే వాహనాల వినియోగం తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించడంపై పరిమితులు వంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశం తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడే అవకాశం ఉంది.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

దీనికి తోడు పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు, మళ్ళీ దేశంలో సాధారణ లాక్‌డౌన్ విధిస్తారేమోనని ‘ఇండియా లాక్‌డౌన్’ (‘India lockdown’) అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఎనర్జీ ఆదా దిశగా సూచనలు చేస్తున్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి లాక్‌డౌన్ ప్రకటించలేదు. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ప్రజలు పానిక్ బయింగ్ చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కొతర ఏర్పడుతుంది. ఎక్కడ చూసిన పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్టులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎనర్జీ లాక్ డౌన్ పై మరిన్ని ఉహాగానాలను పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులు ‘ఎనర్జీ లాక్‌డౌన్’ దిశగా సూచనలు చేస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.