
నాగార్జున, రామ్‌గోపాల్ వర్మల ఐకానిక్ సినిమా ‘శివ’ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. శివ తమపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ ఇండస్ట్రీ మొత్తం కదిలింది.
Key Points
నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబోలో శివ సినిమాకు ప్రత్యేక క్రేజ్.
ఈ నెల 14న శివ సినిమా రీరిలీజ్ అవుతుంది.
చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు వంటి స్టార్స్ రీరిలీజ్‌కు మద్దతు పలికారు.
శివ సినిమా తమ కెరీర్‌పై ఎలా ప్రభావం చూపిందో ప్రముఖులు తెలిపారు.
శివ: ఒక చరిత్ర సృష్టించిన సినిమా
తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమాకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా మా జీవితాల్నే మార్చేసిందని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్లు బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ సినిమాను ఈనెల 14న రీరిలీజ్ చేస్తున్నారు. నాగార్జున టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అమల నటించారు. శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
అయితే.. ఈ సినిమా రీరిలీజ్ కాబోతున్న తరుణంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సినిమాకు విషెస్ చెప్పడంతో పాటు సినిమా వారిపై ఎలా ప్రభావం చూపిందో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, నాని సహా పలువురు వీడియోలు రిలీజ్ చేశారు. వీడియో
ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు
రీరిలీజ్ పై అంచనాలు
శివ రీరిలీజ్ కేవలం ఒక సినిమా విడుదల మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వేడుకగా మారింది. టాలీవుడ్ ప్రముఖుల మద్దతుతో, ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.


