
📌 Key Points
- ప్రముఖ హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ 53 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
- గ్రేస్ అనాటమీ సీరియల్‌లో డాక్టర్ మార్క్ స్లోన్ పాత్రతో ఆయనకు గుర్తింపు లభించింది.
- ఎరిక్ డేన్ ALS వ్యాధితో బాధపడుతూ మరణించారు.
- ALS వ్యాధిపై అవగాహన పెంచడానికి ఎరిక్ డేన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ ఇక లేరు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ALS అనే వ్యాధితో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
ఎరిక్ డేన్ జీవిత ప్రస్థానం
Eric Dane: ప్రముఖ హాలీవుడ్ నటుడు Eric Dane ఇక లేరు. ఆయన వయసు 53 ఏళ్లు. Grey’s Anatomy అనే ప్రసిద్ధ టీవీ సీరియల్‌లో డాక్టర్ మార్క్ స్లోన్ పాత్రతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒక సంవత్సరం క్రితం తనకు ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లీరోసిస్) అనే నాడీ సంబంధిత వ్యాధి ఉందని ఎరిక్ డేన్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు..సన్నిహితుల సమక్షంలో శాంతిగా కన్నుమూశారు.
ఈ నటుడు..X-Men, వాలెంటైన్స్ డే, బాడ్ బాయ్స్ లాంటి సినిమాల్లో నటించారు.
ALS అనేది అరుదైన కానీ తీవ్రమైన వ్యాధి. ఇది మన మెదడు, వెన్నుపాము నుంచి కండరాలకు వెళ్లే నాడీకణాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. దీని వల్ల కండరాల బలహీనత, కదలికల్లో ఇబ్బంది, మాట్లాడటం, మింగడం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎరిక్ డేన్ తన వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల చాలా మందిలో ఈ వ్యాధిపై అవగాహన పెరిగింది.
ALS వ్యాధి అంటే ఏమిటి?
ALS లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. మొదట చేతులు, కాళ్లలో బలహీనత కనిపించవచ్చు. చిన్న పనులు చేయడంలో ఇబ్బంది, కండరాలు కొట్టుకోవడం, నడవడంలో అసౌకర్యం మొదలవుతాయి. తరువాత దశలో మాట తడబడటం, ఆహారం మింగడంలో కష్టం, శ్వాస సమస్యలు రావచ్చు. చివరి దశలో పూర్తిగా కదలలేని పరిస్థితి కూడా రావచ్చు.
ఈ వ్యాధికి పూర్తి నివారణ మందు ఇప్పటికీ లేదు. అయితే కొన్ని మందులు వ్యాధి పురోగతిని కొంతవరకు నెమ్మదించగలవు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శ్వాస సహాయ పరికరాలు రోగులకు ఉపశమనాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ALS వ్యాధిపై అవగాహన
ఎరిక్ డేన్ మరణం ఒక విషయం స్పష్టంగా గుర్తు చేస్తోంది. అరుదైన వ్యాధులపై అవగాహన ఎంత ముఖ్యమో ఆయన జీవితమే ఉదాహరణ. శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా.. వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. సరైన సమయంలో గుర్తిస్తే, జీవన నాణ్యతను కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు.
ఎరిక్ డేన్ మరణం అరుదైన వ్యాధులపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. శరీరంలో ఏదైనా తేడా వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.


