
శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘ఎర్రచీర’ సినిమాకు హారర్ సన్నివేశాలు అధికంగా ఉండటంతో సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ మంజూరు చేసింది. రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది.
Key Points
ఎర్రచీర సినిమాకు హారర్ సన్నివేశాల కారణంగా సెన్సార్ A సర్టిఫికెట్ జారీ చేసింది.
నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంతో పరిచయం అవుతోంది.
సుమన్ బాబు దర్శకత్వంలో మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథతో ఈ సినిమా రూపొందింది.
కార్తీక మాసం సందర్భంగా అక్టోబర్ 24న 'ఎర్రచీర' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఎర్రచీర’కు A సర్టిఫికెట్: కారణాలు
దిశ, వెబ్ డెస్క్: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. “ఎర్రచీర” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు.
హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ..”సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి” అన్నారు. సినిమాలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
సినిమా కథ, ప్రధాన తారాగణం వివరాలు
విడుదల తేదీ, ప్రత్యేకతలు
మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కలయికతో రూపొందిన ‘ఎర్రచీర’ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. కార్తీక మాసం ప్రత్యేకతతో ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.


