|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ రోజే థియేటర్స్‌లోకి ‘ఎర్రచీర’

Published: 24-09-2025, 8:45 AM
ఆ రోజే థియేటర్స్‌లోకి ‘ఎర్రచీర’

రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని నటించిన ‘ఎర్రచీర – ది బిగినింగ్’ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్, హారర్ మరియు యాక్షన్‌లతో కూడిన కథను కలిగి ఉంది.

Key Points

1

రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని నటన

2

మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథాంశం

4

అక్టోబర్ 3న ట్రైలర్, అక్టోబర్ 5న ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘ఎర్రచీర’ విడుదల తేదీ ఖరారు

సీనియర్ ‌ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ ఎర్రచీర – ది బిగినింగ్ ’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే.. అంటే అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కథానాయిక సాయి తేజస్విని నటన

ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయన్నారు.

సుమన్ బాబు దర్శకత్వం

ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు . హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు.

మొత్తంగా ‘ఎర్రచీర’ చిత్రం ప్రేక్షకులను అలరించే అంశాలతో నిండి ఉందని దర్శకుడు తెలిపారు. అక్టోబర్ 10న విడుదలయ్యే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.