|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పేరెంట్స్ బీ అలర్ట్! ‘యూఫోరియా’ మూవీతో గుణశేఖర్ షాకింగ్ మెసేజ్!

Published: 13-02-2026, 4:35 AM
పేరెంట్స్ బీ అలర్ట్! 'యూఫోరియా' మూవీతో గుణశేఖర్ షాకింగ్ మెసేజ్!
  • ఫిబ్రవరి 6న విడుదలై, ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న ‘యూఫోరియా’ చిత్రం!
  • భూమిక, సారా అర్జున్ నటనతో సినిమాకు ప్రశంసలు!
  • పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే చిత్రం!
  • చైత్ర పాత్రలో సారా అర్జున్ నటన అద్భుతం, తప్పక చూడాల్సిన సినిమా!

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యూఫోరియా సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్ నటన అద్భుతంగా ఉంది. పిల్లల పెంపకం గురించి ఆలోచింపజేసే సినిమా ఇది.

గుణశేఖర్ దర్శకత్వంలో యూఫోరియా మూవీ!

యూఫోరియా.. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి నటీనటలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. పిల్లల్ని గారాబంగా పెంచుతున్న ప్రతీ పేరెంట్ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా.. మేం ఎలాగూ ఎంజాయ్ చేయలేకపోయాం.. నువ్వైనా ఎంజాయ్ చెయ్ అని అడిగిందల్లా కొనిచ్చి, కావలసిన సౌకర్యాలను అమర్చే మగపిల్లల తల్లిదండ్రులు ఈ సినిమా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఆడపిల్లల పేరెంట్స్ చూడక్కర్లేదా అంటే చూడాలి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా.. ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చూపించే సినిమా. కేవలం తల్లిదండ్రులే కాదు.. మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూస్తే.. నేటి సమాజం ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

సినిమా.. వింధ్య వేములపల్లి (భూమిక) అనే మహిళ తనపై తానే కేసుపెట్టుకుని కోర్టుకెళ్లడంతో మొదలవుతుంది. దీంతో ఏం జరిగిందోనన్న ఆసక్తి మొదలవుతుంది. ఎవరిని చంపేసిందో అంటూ రకరకాల మాటలు. అలా తనపై తాను కేసు ఎందుకు పెట్టుకుందో వివరిస్తూ స్టోరీ చెప్తుంది. కట్ చేస్తే.. చైత్ర (సారా అర్జున్) చాలా మెరిట్ స్టూడెంట్. సివిల్స్ కు ప్రిపేర్ అయి ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటుంది. ఓ రోజు చైత్ర పార్టీ కోసం తన ఫ్రెండ్ తో ఒక ప్రైవేట్ పార్టీకు వెళ్తుంది. అక్కడ వింధ్య కొడుకు వికాస్ (విఘ్నేశ్ రవిరెడ్డి) అండ్ ఫ్రెండ్స్ ఆమెను ట్రాప్ చేస్తారు.

భూమిక, సారా అర్జున్ ల నటన అదుర్స్!

పార్టీ అయ్యాక తండ్రికోసం ఎదురుచూస్తున్న చైత్రతో మాటలు కలిపి తమకారులో డ్రాప్ చేస్తామని, తన ఫ్రెండ్ బర్త్ డే కూడా ఉందని చిన్న ట్రీట్ తర్వాత పంపించేస్తామని నమ్మిస్తారు. కారెక్కిన చైత్రను ఓ బేకరీ వద్దకు తీసుకెళ్లి ఏవేవో కొని, తమ కారు పాడైందని మరో కారులోకి మారాలని కోరతారు. అక్కడ మరో ఇద్దరు యువకులు కూడా ఉంటారు. ఇంతలో వికాస్.. చైత్రకు తినేందుకు ఫుడ్ ఇవ్వగా అది తిన్న చైత్రకు మత్తు ఎక్కుతుంది. అక్కడికీ తనకు ఏదో అవుతుందని గ్రహించి కారు ఆపమని అడిగినా ఆపకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కారులోనే ఒకరి తర్వాత ఒకరు.. ఐదుగురూ దారుణంగా అత్యాచారం చేస్తారు. ఎక్కడైతే ఆమెకు మాయమాటలు చెప్పి కారెక్కించుకున్నారో తిరిగి అక్కడే దింపేసి వెళ్లిపోతారు.

ఇంటికి వెళ్లిన చైత్ర ట్రాన్స్ లోకి వెళ్లి.. తనలో తానే కుమిలిపోతుంటుంది. మూడ్రోజులకు ఏమైందని తల్లి అడగ్గా బోరుమని ఏడుస్తూ జరిగిన దారుణమంతా చెప్తుంది. ఆపై తాను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడి నుంచి గౌతమ్ మీనన్.. జయదేవ్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రంగంలోకి దిగుతాడు. నిందితులు మైనర్లు కావడంతో వారి పేర్లు చెప్పకుండా తల్లిదండ్రుల పేర్లను బయటపెడతాడు. అందరూ బిగ్ షాట్సే. వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు ఈ లిస్టులో ఉండటం సెన్సేషన్ అవుతుంది. విచారణలో ఒక్కరు కూడా నోరు విప్పకపోవడంతో ఒక్కొక్కరికి ఐదేసి బిర్యానీలు తెప్పించి పెడతాడు. ఒక అమ్మాయిపై దారుణానికి తెగబడిన వారికి ఆ నొప్పి, వేదన ఎలా ఉంటుందో చూపించిన ఈ సీన్ హైలైట్ గా నిలుస్తుంది.

నేటి సమాజంపై కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం!

విచారణ, సాక్ష్యాలు, కోర్టులో వాదనల తర్వాత ఐదుగురికీ 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అప్పటికే డ్రగ్స్ కు అలవాటుపడిన వికాస్.. జైల్లో మరింత చెడిపోతాడు. డ్రగ్స్ కు అలవాటుపడిన కొడుకుని కాపాడుకుంటే తల్లిగా వింధ్య ఎంతో ఆరాటపడుతుంది. కొడుకుని మార్చేందుకు తానే ఆల్కహాల్ కు, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతుంది. మార్పు వచ్చిందనుకునేలోపు మరో ట్విస్ట్.. కోర్టు తీర్పు తర్వాత చైత్ర ఏమైంది? క్లైమాక్స్ లో వికాస్ పశ్చాత్తాపం చెందుతాడా? తల్లిగా వింధ్య ప్రయత్నం ఫలించిందా? అన్నవి సినిమా చూస్తేనే అర్థమవుతాయి. సినిమా చూసేటపుడు కొన్ని పతాక సన్నివేశాల్లో కచ్చితంగా భావేద్వోగానికి గురవుతారు.

నేటి యువత డ్రగ్స్, సె*క్స్ కు విపరీతంగా అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఈ విషయాలను తెలియని వారికి కూడా తెలియజెప్పేందుకే గుణశేఖర్ ఈ యూఫోరియాను తెరకెక్కించారు. అవసరాలకు మించి తల్లిదండ్రులు డబ్బివ్వడమే తప్పవుతోందా ? మైనర్ల జీవితాలను బలితీసుకునేది ఎవరు? అన్న కోణాల్లో సినిమాను తెరకెక్కించడం ప్రశంసనీయం. ప్రతీ ఒక్కరినీ యూఫోరియా ఆలోచింపజేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. డియర్ పేరెంట్స్.. మీరు కూడా మీ పిల్లలతో కలిసి యూఫోరియా చూడండి. ఇలాంటి సినిమాలు చూడటంలో తప్పేం లేదు. సినిమాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక మంచి. అంతేకాని దాన్ని నెగిటివ్ యాంగిల్ లో తీసుకోకూడదన్న విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి.

యూఫోరియా సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ సినిమా చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.