
📌 Key Points
- ఫైమాకి సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తామని చెప్పి పనిమనిషి పాత్ర ఇవ్వడంతో షాక్!
- మొదట్లో సినిమా అంటే భయమని చెప్పిన ఫైమా.. ఆఫర్ వచ్చాక ఒకే చెప్పింది.
- సెట్ లో డైలాగ్ లేని పనిమనిషి పాత్ర ఇవ్వడంతో ఫైమా తిరస్కరించింది.
- నెటిజన్ల కామెంట్స్: ‘నీ మొహానికి ఆ పాత్ర కూడా ఎక్కువే’ అంటూ ట్రోల్స్.
జబర్దస్త్ ఫైమా సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలో మంచి పాత్ర ఇస్తామని చెప్పి పనిమనిషి పాత్ర ఇచ్చారంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
సినిమా అంటే భయపడిన ఫైమా
‘పటాస్’ ఫైమా(Faima) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘పటాస్’ మాత్రమే కాదు ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఈ అమ్మడు తన టాలెంట్ తో అవకాశాలు కొట్టేసి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస షోలతో బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయి. స్టార్టింగ్‌లో నాకు సినిమాలు అంటే చాలా భయమేసేది ఎందుకంటే మూవీ షూట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు.
స్టేజ్ వరకే నాకు తెలుసు. మూవీస్‌లో ఎలా చేస్తారో ఆ టేక్స్ ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. అయితే చాలా అవకాశాలు వచ్చినప్పుడు ఒకటి ట్రై చేద్దామని ఓకే చేశాను. అయితే స్టార్టింగ్‌లో నా క్యారెక్టర్ మంచిగా ఉంటది.. నాదే లీడ్ రోల్ అన్నారు. కానీ తీరా సెట్‌కి వెళితే నాకు పని మనిషి క్యారెక్టర్ ఇచ్చారు. అంతేకాకుండా ఒక డైలాగ్ మాత్రమే ఉంది ఈ పాత్రకు. అది ఎడిటింగ్‌లో ఉంచుతారో లేదో కూడా తెలీదు అని నేను చేయను అని చెప్పేశా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు నీ మొహానికి అది కూడా ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పనిమనిషి పాత్రతో షాక్
నెటిజన్ల ట్రోల్స్
ఫైమా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

