
📌 Key Points
- మంజు వారియర్‌కు షాక్ ఇచ్చిన అభిమాని: పాలక్కాడ్‌లో జరిగిన ఘటన వైరల్!
- ఫొటోలు దిగేందుకు ఎగబడ్డ అభిమానులు, ఊహించని విధంగా ముద్దు పెట్టుకున్న లేడీ ఫ్యాన్!
- వెంటనే స్పందించిన యాంకర్: సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరిక!
- కూల్ గా రియాక్ట్ అయిన మంజు వారియర్: సీరియస్ అవ్వకుండా సర్దిచెప్పారు!
సెలబ్రిటీలకు అభిమానుల తాకిడి ఎక్కువవుతున్న ఈ సమయంలో, మంజు వారియర్‌కు జరిగిన ఈ సంఘటన షాకింగ్‌గా ఉంది. అభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
మంజు వారియర్‌కు షాకిచ్చిన అభిమాని!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సెలబ్రిటీలు కనిపిస్తే ఎగబడి సెల్ఫీలు దిగడం, మీద పడిపోవడం చేస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా సందర్భంగా నిధి అగర్వాల్ ను అభిమానులు చాలా ఇబ్బంది పెట్టారు. అయితే అలాంటి సంఘటనే తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కు ( Manju Warrier) చోటు చేసుకుంది. కేరళలోని పాలక్కాడ్ లో ఈవెంట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులందరూ హీరోయిన్ మంజు వారియర్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
యాంకర్ సీరియస్ వార్నింగ్!
అయితే అందులో ఓ లేడీ అభిమాని బలవంతంగా హీరోయిన్ మంజు వారియర్ కు ముద్దు పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఇక అక్కడే ఉన్న ఈవెంట్ యాంకర్ వెంటనే రియాక్ట్ అయి, అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరి కాదని వెల్లడించింది. ఇంత తతంగం జరుగుతున్న కూడా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ సీరియస్ కాలేదు. చాలా కూల్ గా ఉంటూ ఎవరిని ఏమనలేదు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
కూల్ రియాక్షన్ ఇచ్చిన హీరోయిన్!
A post shared by Cinema scoop (@cs_review)
మంజు వారియర్‌కు జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


