
📌 Key Points
- సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో షాకింగ్ ఘటన.
- భర్త రాజ్ నిడిమోర్ సమక్షంలో సమంతకు అభిమాని మోకాళ్లపై ప్రపోజ్.
- పూల బొకే ఇచ్చి, సెల్ఫీ దిగిన ఫ్యాన్; వీడియో క్షణాల్లో వైరల్.
- రాజ్ నిడిమోర్, సమంతల కూల్ రియాక్షన్‌పై నెటిజన్ల ప్రశంసలు.
టాలీవుడ్ సెన్సేషన్ సమంత అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తాజాగా ఆమె సినిమా ఈవెంట్‌లో జరిగిన ఒక అనూహ్య సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భర్త ముందే సమంతకు ఒక అభిమాని చేసిన ప్రపోజల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై పూర్తి వివరాలు ఇక్కడ!
భర్త ముందే సమంతకు ప్రపోజ్: అసలేం జరిగింది?
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో సోమవారం హైదరాబాద్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోర్ కూడా పాల్గొని సందడి చేశారు. అయితే సమంత వచ్చిన ఈ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో రాజ్ నిడిమోర్ స్టేజ్ పై మాట్లాడుతుండగా… ఓ అభిమాని ఒక్కసారిగా సమంత దగ్గరికి వచ్చాడు. తన చేతిలో ఉన్న పూల బొకేను హీరోయిన్ సమంతకు ఇచ్చి, తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రియురాలికి ప్రపోజ్ చేసినట్లుగానే, మోకాళ్లపై నిలబడి హీరోయిన్ సమంతకు బొకే అందించాడు. ఆ తర్వాత హీరోయిన్ సమంతతో సెల్ఫీ కూడా దిగాడు. అయితే ఇంత జరుగుతున్నా రాజ్ నిడిమోర్ మాత్రం చాలా కూల్ గా వ్యవహరించారు. అటు సమంత కూడా కోపం తెచ్చుకోకుండా, సెల్ఫీ దిగిన తర్వాత అతన్ని పంపించేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సమంత భర్త రాజ్ నిడిమోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత స్వరాలు అందించారు.
నిడిమోర్ కూల్ రియాక్షన్: ఫ్యాన్స్‌లో చర్చ!
మా ఇంటి బంగారం: రిలీజ్ డేట్, మూవీ విశేషాలు!
సమంతకు సంబంధించిన ఈ వైరల్ ఘటన టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ‘మా ఇంటి బంగారం’ సినిమాపై అంచనాలను పెంచింది. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్‌ల కోసం మాతోనే ఉండండి!


