|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిడ్డకు పాలు పట్టి..షూటింగ్‌కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు!

Published: 14-10-2025, 8:19 AM
బిడ్డకు పాలు పట్టి..షూటింగ్‌కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు!

బాలీవుడ్ స్టార్ రాణి ముఖర్జీ ఇటీవలి ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలోని కష్టాలను, తల్లిగా ఆమె బాధ్యతలను వివరించారు. బిడ్డకు పాలు పడుతూనే షూటింగ్‌కు వెళ్లిన అనుభవం పంచుకున్నారు. ఆమె జాతీయ అవార్డును స్వీకరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

చిత్ర పరిశ్రమలో మహిళలు రాణించడానికి ఎన్నో త్యాగాలు చేయాలని రాణి అభిప్రాయపడ్డారు.

2

'హిచ్ కీ' షూటింగ్ సమయంలో 14 నెలల బిడ్డకు పాలు పడుతూ, ఉదయం షూటింగ్‌కు వెళ్లిన రాణి.

4

జాతీయ అవార్డు అర్హులైన వారికి రావాలని, అందరూ అంగీకరించడమే గొప్ప గౌరవం అంది.

చిత్ర పరిశ్రమలో రాణి ముఖర్జీ కష్టాలు

ఏ రంగంలో అయినా మహిళలు రాణించాలంటే .. చాలా త్యాగాలు చేయాల్సిందే . ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్ ‌ చేయాలి . ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ ఆ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోలేరు . చిత్రపరిశ్రమలో ఆ కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి . ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను , ఒత్తిడిని తట్టుకొని నిలబడితేనే ‘ స్టార్ ‌’ హోదా పొందుతారు . అలాంటి కష్టాలను ఎన్నో భరించే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్ ‌ స్టార్ ‌ హీరోయిన్ ‌ రాణి ముఖర్జీ(Rani Mukerji) . ఇటీవలే ఉత్తమన నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ మె .. కెరీర్ ‌ ప్రారంభంలో తకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది .

‘ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది . నేను ఇండస్ట్రీలోకి రావడం మా పెరెంట్స్ ‌ కి ఇష్టమే లేదు . బలవంతంగా ఒప్పుకున్నారు . వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్ ‌ మెంట్ ‌ తో పని చేశాను . నేను నటించిన ‘ హిచ్ ‌ కీ ’ సినిమా షూటింగ్ ‌ సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే . అప్పటికీ పాలు పడుతున్నా . ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టించి .. షూటింగ్ ‌ కి వెళ్లేదాన్ని . ఒంటి గంటలోపు నా పార్ట్ ‌ పూర్తి చేసుకొని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని .

బిడ్డకు పాలిస్తూ “హిచ్ కీ” షూటింగ్

రోజుకు 6-7 గంటలు షూటింగ్ ‌ చేసి .. ఇంటికి వెళ్లేదాన్ని . మా దర్శకుడితో పాటు యూనిట్ ‌ అంతా నాకు సపోర్ట్ ‌ చేసేది . ఈ సినిమా మొత్తం అలానే పూర్తి చేశా . ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది . నిర్మాతకు , దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి . లేదంటే ఆ సినిమా మానేయాలి . అది మన చేతుల్లో ఉంటుంది . కచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరు ’ అని రాణి ముఖర్జీ అన్నారు .

జాతీయ అవార్డుపై రాణి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ .. ‘ నటీనటులుకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే . అయితే ఏ అవార్డు అయినా .. అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి . నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు . అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించింది ’ అన్నారు .

రాణి ముఖర్జీ ప్రయాణం చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లకు అద్దం పడుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఆమె సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. జాతీయ అవార్డుపై ఆమె వ్యాఖ్యలు ఆలోచింపజేసేవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.