|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిఫా ఫైనల్ కోసం కేరళ సంచలన నిర్ణయం! స్కూల్స్, కాలేజీలకు ఊహించని సెలవు!

Published: 19-07-2026, 6:40 AM

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌలభ్యం కోసం సోమవారం రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. క్రీడా ప్రియుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శంశుద్దిన్ వెల్లడించారు. ఇది విద్యార్థులకు, క్రీడాభిమానులకు సంతోషాన్నిచ్చింది.

Key Points

1

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ కోసం కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

2

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు.

4

అర్ధరాత్రి మ్యాచ్ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ చర్య.

కేరళ సర్కార్ కీలక నిర్ణయం

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 తర్వాత ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. క్రీడాలను ప్రేమించే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ మంత్రి శంశుద్దిన్ వెల్లడించారు.

ఇక కేరళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో క్రీడా ప్రియులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సరిగ్గా రేపు ఉద‌యం 12:30 AMకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో స్పెయిన్, అర్జెంటీనా తలపడనున్నాయి. షూట్ ఔట్ వరకు వెళ్తే మార్నింగ్ వరకు ఈ మ్యాచ్ కొనసాగనుంది. అయితే రాత్రంతా విద్యార్థులు మేల్కొని.. పొద్దున స్కూళ్ల‌కు రావడం ఇబ్బందిగా మారనుంది. ఈ క్రమంలోనే హాలిడే ప్రకటించింది కేరళ సర్కార్.

విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సెలవు

ఫిఫా ఫైనల్ సమయం, ప్రభావం

కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యతను, విద్యార్థుల పట్ల వారి శ్రద్ధను తెలియజేస్తుంది. అర్ధరాత్రి మ్యాచ్‌ను వీక్షించిన తర్వాత విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.