
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల శాతం విధానంపై వివాదాలు నెలకొన్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Key Points
థియేటర్ల బంద్ నిర్ణయం వాయిదా
ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది
అన్ని సెక్టార్లతో చర్చలు జరుగుతున్నాయి
ఫిలిం ఛాంబర్ మీటింగ్
Movie Theaters : గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య థియేటర్స్ పర్శంటేజ్ విధానం కోసం చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ థియేటర్స్ బంద్ లేదని ఓ రెండు రోజుల ముందే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. తాజాగా నేడు థియేటర్స్ సమస్యలపై ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది.
థియేటర్ల బంద్ వాయిదా
ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం
థియేటర్ బిజినెస్ లోని అన్ని సెక్టార్లతో నేడు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా వేసినట్టు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో అన్ని సెక్టార్స్ ని పరిగణనలోకి తీసుకుని ఈ సమస్య పై ఒక కమిటీ వేస్తాము అని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందని తెలిపింది ఫిలిం ఛాంబర్.
చివరగా, థియేటర్ల బంద్ విషయంలో ఫిలిం ఛాంబర్ స్పష్టతనిచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.


