|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Srikanth Iyengar Issue: శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూపై సినీ పెద్దలు స్పందించాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్

Published: 12-10-2025, 3:43 AM
Srikanth Iyengar Issue: శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూపై సినీ పెద్దలు స్పందించాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్

సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో MLC బల్మూరి వెంకట్ సైబర్ సెల్ పోలీసులకు, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్‌పై సినీ పెద్దలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Key Points

1

సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

2

MLC బల్మూరి వెంకట్ సైబర్‌ సెల్‌ పోలీసులకు, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.

4

మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీకాంత్ అయ్యంగార్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు

Srikanth Iyengar Issue: సినీనటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శనివారం సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మా అసోసియేషన్ లో కూడా ఫిరాద్యు చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వాక్‌ స్వతంత్రం పేరుతో హద్దులుమీరి మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై సినీ పెద్దలు(Srikanth Iyengar Issue) సైతం స్పందించాలి. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

Sai Durga Tej: అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. నాకు చాలా గర్వంగా ఉంది: సాయి దుర్గ తేజ్

సినీ పెద్దలకు వెంకట్ డిమాండ్

మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన పోస్టులు పెడుతున్నాడు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా పెద్దలను కూడా మీరు కోరేది ఒక్కటే మీరు దీనిపై వెంటనే స్పందించాలి. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, మేము యాంటీ బయోటిక్ గా మారాల్సి వస్తుంది. అంటూ ఘాటుగా స్పందించారు.

మా అసోసియేషన్ స్పందన

ఇక దీనిపై స్పందించిన మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందించారు. ఈరోజుల్లో ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఫ్యాషన్ అయిపొయింది. మాకు డిస్ప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంది. ఈ విషయం గురించి పూర్తిగా చర్చించి, కమిటీ మీటింగ్ పెట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

ఈ వివాదంపై మా అసోసియేషన్ స్పందించింది. శ్రీకాంత్ అయ్యంగార్ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని జనరల్ సెక్రటరీ శివ బాలాజీ హామీ ఇచ్చారు. ఈ ఇష్యూ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.