|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కృష్ణ `అగ్నిపర్వతం`తో పోటీపడి కోలుకోలేని దెబ్బతిన్న చిత్రాలివే.. చిరంజీవి, బాలయ్యకు చెమటలు

Published: 15-11-2025, 6:39 AM
కృష్ణ `అగ్నిపర్వతం`తో పోటీపడి కోలుకోలేని దెబ్బతిన్న చిత్రాలివే.. చిరంజీవి, బాలయ్యకు చెమటలు

సూపర్‌ స్టార్ కృష్ణ రెండో వర్థంతి సందర్భంగా ఆయన నటించిన `అగ్నిపర్వతం` సినిమా విశేషాలు వైరల్ అవుతున్నాయి. 1985లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించగా, దీనితో పోటీపడిన చిరంజీవి, బాలయ్య వంటి స్టార్ల చిత్రాలు ఎలాంటి దెబ్బతిన్నాయో తెలుసుకుందాం.

Key Points

1

సూపర్‌ స్టార్‌ కృష్ణ `అగ్నిపర్వతం` 1985 సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది.

2

కృష్ణ మాస్ డైలాగ్‌లు, ముఖ్యంగా `అగ్గిపెట్టి ఉందా` ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

4

కృష్ణ రెండో వర్థంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని ఈ ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

`అగ్నిపర్వతం` కృష్ణ కెరీర్లో ఎందుకు ప్రత్యేకం?

నేడు శనివారం(నవంబర్‌ 15) సూపర్‌ స్టార్‌ కృష్ణ రెండో వర్థంతి. రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో భాగంగా కృష్ణ `అగ్నిపర్వతం` మూవీతో పోటీ పడి గట్టి దెబ్బ తిన్న చిత్రాలకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. వీటిలో చిరంజీవి, బాలయ్య మూవీస్‌ ఉండటం గమనార్హం. మరి ఈ మూవీ ఎప్పుడు వచ్చింది. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో పోటీ పడ్డ సినిమాలేంటనేది తెలుసుకుందాం.

సూపర్‌ స్టార్‌ కృష్ణ 1980లో హీరోగా పీక్‌లో ఉన్నారు. ఆయన 70 నుంచే స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. కమర్షియల్‌ చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు అందుకున్నారు. ఆ ఫ్లోలో వచ్చిన మరో మూవీ `అగ్నిపర్వతం`. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1985 జనవరి 11న విడుదలైంది. సంక్రాంతి కానుకగా వచ్చింది. కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమారం రేపింది. సంక్రాంతి సీజన్‌ కావడంతో అందరి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో మాస్‌ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి. అందులో `అగ్గిపెట్టి ఉందా` అంటూ కృష్ణ అడిగే డైలాగ్ లకు మాస్‌ ఆడియెన్స్ ఊగిపోయారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ డైలాగ్‌ మారుమోగిందంటే అతిశయోక్తి కాదు.

`అగ్నిపర్వతం`తో పోటీపడి దెబ్బతిన్న చిరంజీవి చిత్రం

ఇందులో కృష్ణకి జోడీగా రాధా, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు నెగటివ్‌ రోల్స్ చేశారు. అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ మూవీ కమర్షియల్‌గా సునామీ సృష్టించింది. ఎనిమిది సెంటర్లలో 125 రోజులు ప్రదర్శించబడింది. కృష్ణకి ఆ టైమ్‌లో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. అయితే దీనితో పోటీ పడి పలు చిత్రాలు బోల్తా కొట్టాయి. పెద్ద హిట్‌ కావాల్సిన చిత్రాలు యావరేజ్‌గా మారితే, మామూలు మూవీస్‌ డిజాస్టర్‌గా నిలిచాయి.

కృష్ణ `అగ్నిపర్వతం`కి పోటీగా విడుదలైన మూవీ `చట్టంతో పోరాటం`. ఇందులో చిరంజీవి హీరో. ఆయన సరసన మాధవి, సుమలత హీరోయిన్లుగా నటించారు. రావు గోపాలరావు విలన్‌. కే బాపయ్య దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగానే జనవరి 11నే విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. `అగ్నిపర్వతం` జోరు ముందు చతికిలపడింది. ఆడియెన్స్ అంతా కృష్ణ మూవీ వైపు మొగ్గు చూపడంతో హిట్‌ కావాల్సిన `చట్టంతో పోరాటం` కేవలం యావరేజ్‌గానే ఆడింది. నిర్మాతలను కొంత నిరాశ పరిచింది.

సంక్రాంతి పోటీలో మిగతా చిత్రాల పరిస్థితి

కృష్ణ `అగ్నిపర్వతం`కి రెండు వారాల గ్యాప్‌తో బాలయ్య హీరోగా వచ్చిన `ఆత్మబలం` మూవీ విడుదలైంది. దీనికి తాతినేని ప్రసాద్‌ దర్శకుడు. రొమాంటిక్‌ మ్యూజిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1985 జనవరి 24న విడుదలైంది. ఇందులో భానుప్రియా హీరోయిన్‌. సిల్క్ స్మిత ఓ పాత్రలో మెరిసింది. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఏమాత్రం అలరించలేకపోయింది. అప్పటికే `అగ్నిపర్వతం` జోరు నడుస్తుంది. దీంతో బాలయ్య సినిమా అలరించలేకపోయింది. ఆడియెన్స్ కృష్ణ మూవీకే ఎగబడ్డారు. దీంతో బాలయ్య `ఆత్మబలం` డిజాస్టర్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమాకి ఒక్క రోజు గ్యాప్‌తో వచ్చిన కామెడీ చిత్రాలు, ఫ్యామిలీ మూవీస్‌ మంచి ఆదరణ పొందాయి. సుమన్‌, రాజేంద్రప్రసాద్‌ నటించిన `దేశంలో దొంగలు పడ్డారు` సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతోపాటు నరేష్‌ నటించిన `పుత్తడి బొమ్మ` సైతం ఆకట్టుకుని విజయం సాధించింది. అయితే ఇవి చిన్న బడ్జెట్‌ చిత్రాలు కావడంతో నిర్మాతలు సేఫ్‌ అయ్యారు. కానీ బాలయ్య, చిరంజీవి మూవీస్‌ భారీ బడ్జెట్‌తో రూపొందాయి. దీంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలా మొత్తంగా చిరంజీవి, బాలయ్యకి తన `అగ్నిపర్వతం`తో చెమటలు పట్టించారు కృష్ణ.

మొత్తంమీద, కృష్ణ `అగ్నిపర్వతం` 1985 సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. దీని ధాటికి పలు పెద్ద చిత్రాలు సైతం తట్టుకోలేకపోయాయి. కృష్ణ సినీ ప్రస్థానంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.