
సినిమాల్లో హీరోల గుర్రపు స్వారీలు సర్వసాధారణం. కానీ, గుర్రాన్ని గాల్లోకి ఎగరవేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల అనే యువ హీరో.
Key Points
స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గుర్రాన్ని గాల్లోకి ఎగరవేసిన ఫోటో వైరల్!
రోషన్ కనకాల 'మౌగ్లీ' సినిమా షూటింగ్ లో భాగంగా ఈ ఘట్టం జరిగింది.
రోషన్ కనకాల తన మొదటి సినిమా 'బబుల్ గమ్' తో పరాజయాన్ని చవిచూశాడు.
సుమ కుమారుడిగా, ఆయన సినీ ప్రస్థానంపై అభిమానుల ఆసక్తి పెరుగుతోంది.
గుర్రపు స్వారీలో రోషన్ కనకాల
Find Actor : మన హీరోలు సినిమాల్లో గుర్రపు స్వారీలు చేస్తారని తెలిసిందే. ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా అన్ని జనరేషన్స్ లో చాలా మంది హీరోలు గుర్రాలపై స్వారీ చేసి మెప్పించినవారే. కొంతమంది అయితే బయట కూడా గుర్రాలపై స్వారీ చేస్తారు. ఈ కోవలో ఓ యువ హీరో కూడా గుర్రపు స్వారీ చేస్తున్నాడు. తాజాగా ఆ హీరో ఓ మూవీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఫోటోని మూవీ యూనిట్ షేర్ చేసింది. ఇంతకీ ఆ గుర్రాన్ని స్వారీ చేసేది ఎవరో, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో గుర్రాన్ని గాల్లోకి ఎగిరిస్తున్న హీరో రోషన్ కనకాల. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు. రోషన్ కనకాల గతంలో బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైంది. ఇప్పుడు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మౌగ్లీ అనే సినిమా చేస్తున్నాడు రోషన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
మొదటి సినిమా పరాజయం
‘మౌగ్లీ’ సినిమా షూటింగ్
ఈ సినిమాలో రోషన్ గుర్రపు స్వారీ చేస్తాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ రోషన్ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఈ ఫోటోని షేర్ చేసారు.
రోషన్ కనకాల ‘మౌగ్లీ’ సినిమాతో తన అదృష్టాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


