|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి

Published: 30-04-2025, 6:45 AM
ఓటీటీలో దుమ్ము రేపుతున్న తొలి కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్.. ఐదు రోజుల్లోనే ఆ అరుదైన మైలురాయి

కన్నడ నుండి వచ్చిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అయ్యన మనె’ ఓటీటీలో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. కథ, నటనతో ప్రేక్షకులను మైమరిపించింది.

Key Points

1

కన్నడలో తొలి క్రైమ్ థ్రిల్లర్ 'అయ్యన మనె' ఓటీటీలో దుమ్మురేపుతోంది.

2

ఐదు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను అందుకున్న ఈ సిరీస్‌కు ప్రేక్షకాదరణ అద్భుతం.

4

కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ తెలుగులోకి రావడానికి అవకాశాలున్నాయి.

అయ్యన మనె: కన్నడ ఓటీటీ సెన్సేషన్

ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ తెలుగు సహా ఎన్నో భాషలకు చెందిన ఎన్నో వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కన్నడ నుంచి మాత్రం ఈ మధ్య తొలి వెబ్ సిరీస్ వచ్చింది. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో కావడం విశేషం. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఐదు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

కన్నడ లో రూపొందిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు అయ్యన మనె. అంటే అయ్యన ఇల్లు అని అర్థం. ఈ సిరీస్ ఏప్రిల్ 25న జీ5 ఓటీటీ లోకి అడుగుపెట్టింది. తొలి ఐదు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సొంతం చేసుకుంది. రమేష్ ఇందిర డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్ల పాటు సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ కేవలం 18 నుంచి 20 నిమిషాలే ఉండటం గమనార్హం.

5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో రికార్డు

ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కన్నడతోపాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు భాషల్లోనూ ఈ సిరీస్ దూసుకెళ్తోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఈ సిరీస్ ను ప్రేక్షకులకు బాగా ఆదరిస్తున్నారు.

అయ్యన మనె వెబ్ సిరీస్ జాజి (ఖుషీ రవి) అనే ఓ కొత్తగా పెళ్లయిన అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ. చిక్కమగళూరులోని ఓ ఇంట్లో సాగుతుంది. అయ్యన ఇంట్లోకి కొత్త కోడలిగా జాజి అడుగుపెడుతుంది. అయితే అప్పటికే ఆ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూస్తారు.

క్రైమ్, సస్పెన్స్‌తో ఆకట్టుకునే కథ

తమ ఇంటికి ఉన్న శాపం వల్లే ఇలా జరుగుతుందని ఆ ఇంట్లో వాళ్లు భావిస్తారు. మరో ముగ్గురు కూడా అలా చనిపోతారని వాళ్లు నమ్ముతారు. కానీ దీని వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగి ఉందని జాజి అనుమానిస్తుంది. ఇంట్లో పనిమనిషి సాయంతో ఈ మరణాలపై ఆరా తీయడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.

తర్వాత ఏం జరుగుతుంది? జాజి కూడా కన్నుమూస్తుందా? అంతకుముందు జరిగిన మరణాల గుట్టు రట్టు చేస్తుందా అన్నది తెలుసుకోవాలంటే ఈ అయ్యన మనె వెబ్ సిరీస్ చూడాల్సిందే. ప్రస్తుతానికి కన్నడ, హిందీల్లోనే సిరీస్ అందుబాటులో ఉంది. తెలుగులోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో మాన్సీ సుధీర్, విజయ్ శోభరాజ్ పవూర్, అనిరుధ్ ఆచార్య, అక్షయ్ నాయక్, హితా చంద్రశేఖర్, ఖుషీ చంద్రశేఖర్ లాంటి వాళ్లు నటించారు.

చిన్న పొడవున్న ఎపిసోడ్స్‌తోనూ ప్రేక్షకులను అలరించిన ‘అయ్యన మనె’ కన్నడ ఓటీటీకి కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.