
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా చెవెళ్లలోని రిసార్ట్‌లో పోలీసులు దాడి చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం, గంజాయి కనిపించింది.
Key Points
ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు పార్టీలో పోలీసుల దాడి జరిగింది.
పార్టీలో భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్.
పార్టీ నిర్వాహకులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు.
మంగ్లీ పుట్టినరోజు వేడుకలు
ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ (Mangli) చిక్కుల్లో పడింది. తన పుట్టిన రోజు సందర్భంగా చెవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్‌పై చెవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెయిడ్‌లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
పోలీసుల ఆకస్మిక దాడి
NDPS యాక్ట్ కింద కేసు నమోదు
ఈ ఘటనతో మంగ్లీ చిక్కుల్లో చిక్కుకుంది. పోలీసుల దర్యాప్తుతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు.


