
ఈ వారాంతం ఓటీటీ ప్రేక్షకులకు పండగే! జూలై 11న 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామా’ సినిమాతో పాటు, మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉంటాయి.
Key Points
జూలై 11న 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల
సుహాస్ నటించిన 'ఓ భామ అయ్యో రామా' సినిమాపై అంచనాలు
8 వసంతాలు, శారీ, కలియుగం లాంటి తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధం
మలయాళం, కన్నడ సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా
శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్ బాయ్స్, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్‌లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్‌లో ఎంజాయ్ చేయండి.
ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) – జూలై 11 జాస్ ది డిఫినేటివ్ ఇన్‌సైడ్ వెడ్డింగ్- జూలై 11 బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) – జూలై 13
8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11 ఆప్ జైసే కోయ్ – జూలై 11 మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ – జూలై 11 ఎమోస్ట్ కాప్స్ – జూలై 11 డిటెక్టివ్ ఉజ్వలన్(మలయాళ సినిమా) -జులై 11
సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా ప్రేక్షకుల ఆసక్తిని రేపుతోంది
శారీ(తెలుగు సినిమా)- జూలై 11
కలియుగం – జూలై 11 కర్కి(కన్నడ సినిమా)- జూలై 11
మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ – జూలై 11
నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ అవుతోంది)
వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి
ఫౌండేషన్ (సీజన్ ) – జూలై 11
ఫోర్ ఇయర్స్ లేటర్ – జూలై 11 జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్‌సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11 మిస్టర్ రాణి – జూలై 11 ద సైలెంట్ అవర్ – జూలై 11
పాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ – జూలై 11
ఈ వారాంతంలో మీ కుటుంబంతో కలిసి ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలను ఆస్వాదించండి. వివిధ భాషలు, ప్రక్రియలు కలిగిన చిత్రాలతో మీకు ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.


