
అసోంకు చెందిన బేబీడాల్ అర్చి తన కష్టతరమైన గతం నుండి ఎలా బయటపడి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదిగిందో ఈ కథనం వివరిస్తుంది. ఆమె అనుభవాలు, ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకుందాం.
Key Points
అసోంకు చెందిన బేబీడాల్ అర్చి ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించింది.
ఆమె ఆరు సంవత్సరాల పాటు వ్యభిచారంలో చిక్కుకుని, తనను తాను రక్షించుకుంది.
అమెరికన్ అడల్ట్ స్టార్ కేంద్రా లస్ట్‌తో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు.
ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అర్చి యొక్క విజయం
వేశ్యావృత్తి నుంచి ఇన్‌స్టా స్టార్‌గాఅసోంకు (Assam) చెందిన ఈ బోల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్, స్టైలిష్ వీడియోలు, డేర్‌గా ఉండే ఫొటోలు, ఆకర్షణీయమైన ట్రాన్సిషన్ కంటెంట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 8 లక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె పేరు మరింత హాట్‌టాపిక్ అవుతోంది. కారణం, అమెరికన్ అడల్ట్ స్టార్ కేంద్రా లస్ట్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఇద్దరూ తరచూ సోషల్ మీడియాల్లో పరస్పరం ట్యాగ్ చేసుకుంటుండటంతో ఈ వార్తలు వైరల్‌గా మారాయి.
ఇక ప్రస్తుతం గ్లామరస్ రీల్స్, ఫోటోలు షేర్ చేస్తున్న అర్చిత ఫుకాన్ ఒక్కప్పుడు ఎంతో గడ్డు కాలాన్ని గడిపింది. 2023లో ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్‌లో తాను ఆరు సంవత్సరాల పాటు వ్యభిచారంలో చిక్కుకున్నానని, స్వేచ్ఛ పొందేందుకు దాదాపు రూ.25 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అర్చిత న్యూఢిల్లీలోని జీబీ రోడ్.. రెడ్ లైట్ ఏరియాను జియోట్యాగ్ చేస్తూ చేసిన ఆ పోస్ట్ ఆమె గతంలోని చీకటి చాటిచెప్పింది. ఆమె ఎవరికి ఆ మొత్తం చెల్లించిందో వెల్లడించకపోయినా, ఆమె చెప్పిన వ్యక్తిగత పోరాటం ఎన్నో మనసులను తాకింది.
ఆమె గతంలోని కష్టాలు
కేవలం తానే కాదు, అదే పరిస్థితిలో ఉన్న ఎనిమిది మంది బాలికలను కూడా అర్చిత రక్షించింది. ఓ నమ్మకమైన స్నేహితుడు, సహాయసంస్థ సాయంతో వారిని బయటకు తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘ఈ రోజు నేను గర్వంగా నిలబడి చెప్పగలగుతున్నాను. ఆశ, సహనం, ఆత్మబలంతో చీకటినుంచి వెలుగులోకి రావచ్చు’ అంటూ ఆమె ఒక పోస్ట్‌లో పేర్కొంది.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడల్ట్ కంటెంట్‌తో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు అడల్డ్ కంటెంట్ చేసిన సన్నీ లియోన్.. ఆ తర్వాత సినిమా స్టార్‌గా మారినట్లుగానే, ఫుకాన్ కూడా సినిమాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటుంది.
వేశ్యావృత్తి నుండి ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా మారిన అర్చి కథ ఒక ప్రేరణాదాయకమైనది. ఆమె పట్టుదల, ధైర్యం ఎందరికీ స్ఫూర్తినిచ్చేవి.


