|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.. బిగ్ అప్డేట్ ఇచ్చిన శివాత్మిక

Published: 28-10-2025, 12:54 PM
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.. బిగ్ అప్డేట్ ఇచ్చిన శివాత్మిక

హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన తాజా చిత్రం ‘ఆరోమలే’ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 29న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. నవంబర్ 7న సినిమా థియేటర్లలోకి రానుంది.

Key Points

1

నటి శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలో 'ఆరోమలే' చిత్రం తెరకెక్కుతోంది.

2

కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

4

ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

శివాత్మిక ‘ఆరోమలే’ సినిమా విశేషాలు

స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక (Shivathmika Rajashekar)హీరోయిన్‌గా పరిచయం అయి పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ అనిపించుకోలేకపోయింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటిస్తోంది. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఆరోమలే’ (Aaromaley)ఒకటి. . సారంగ్ థ్యాగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిషన్ దాస్ (kishan das), శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. హర్ష నాథ్ ఖాన్, వీ టీవీ గణేష్, మేఘా ఆకాష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మిని పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కంటెంట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, శివాత్మిక రాజశేఖర్ ‘ఆరోమలే’ ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది.. అక్టోబర్ 29న సాయంత్రం 5 గంటలకు మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

A post shared by Harshath Khan 🤡 (@khan_harshath_khan)

ట్రైలర్ విడుదల తేదీ, సమయం ఖరారు

సోషల్ మీడియాలో శివాత్మిక బిగ్ అనౌన్స్‌మెంట్

మొత్తం మీద, శివాత్మిక ‘ఆరోమలే’ ట్రైలర్ అప్డేట్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. పూర్తి వినోదాన్ని అందిస్తుందని ఆమె మాటలు మరింత ఆసక్తిని పెంచాయి. నవంబర్ 7న సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.