
స్టార్ మా ఛానెల్ ఈ వీకెండ్‌కు అదిరిపోయే ప్రోగ్రామ్స్‌ను ప్రకటించింది. ఫన్, రొమాన్స్, ఆధ్యాత్మికం – ప్రతి ఒక్కరికీ ఏదో ఉంది. ప్రోమోలు ఇప్పుడు విడుదలయ్యాయి!
Key Points
కుకు విత్ జాతిరత్నాలు షోలో ప్రభాకర్, బిత్తిరి సత్తి వంటలు!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం: మాన్సూన్ రొమాన్స్!
మా బోనాల జాతర: మంగ్లీ సిస్టర్స్ స్పెషల్ ఆకర్షణ!
ఫన్, రొమాన్స్, ఆధ్యాత్మికం – ఈ వీకెండ్ స్టార్ మాతో!
కుకు విత్ జాతిరత్నాలు: సెలబ్రిటీ వంటలతో సందడి
స్టార్ మా ఛానెల్లో ఈ వీకెండ్ అభిమానులను అలరించడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రోమోలను శుక్రవారం (జులై 25) ఆ ఛానెల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. మరి ఆ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎప్పుడు చూడాలన్నది తెలుసుకోండి.
స్టార్ మా ఈ వీకెండ్ తన ఛానెల్లో టెలికాస్ట్ కానున్న ప్రోగ్రామ్స్ ప్రోమోలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. వీటిలో ఫన్, రొమాన్స్, ఆధ్యాత్మికం.. ఇలా అన్ని రకాల కార్యక్రమాలూ ఉండటం విశేషం. మొదట ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న షో కుకు విత్ జాతిరత్నాలు విషయానికి వద్దాం. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఈవారం మరింత ఫన్ అందించనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
ఆదివారం విత్ స్టార్ మా: మాన్సూన్ రొమాన్స్
ఈసారి ఫేమస్ టీవీ పర్సనాలిటీస్ ప్రభాకర్, బిత్తిరి సత్తిలాంటి సెలబ్రిటీలు వంటలు చేయడానికి వస్తున్నారు. ఈ ప్రోమో మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. వాళ్లు చేసే వంటల కంటే డైలాగులతో పంచిన ఫన్ ఎక్కువగా ఉంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
ఇక ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ మాలో వచ్చే మరో టాప్ రేటెడ్ ప్రోగ్రామ్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం. ఈవారం ఈ షో మాన్సూన్ రొమాన్స్ పంచబోతోంది. షో హోస్ట్ శ్రీముఖి రొమాన్స్ ఈవారం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక ప్రోమో చివర్లో వచ్చిన వాన వాన వెల్లువాయె పాటకు వేసిన స్టెప్పులు మరో లెవెల్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈవారం కూడా స్టార్ మా ఛానెల్ కు చెందిన సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొననున్నారు.
మా బోనాల జాతర: మంగ్లీ సిస్టర్స్ ప్రత్యేక ప్రదర్శన
ఇక ఆదివారం (జులై 27) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా స్పిరిచువల్ టచ్ ఇస్తూ మా బోనాల జాతరను తీసుకొస్తోంది. ఈ షోకి మంగ్లీ సిస్టర్స్ స్పెషల్ గెస్టులుగా వస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి బోనాల కోసం వేసిన స్టెప్స్ ను ప్రోమోలో చూడొచ్చు. మంగ్లీ సిస్టర్స్ డ్యాన్స్ ఫ్లోర్ పైకి దిగితే పండగ పీక్ స్టేజ్ కు వెళ్తుందంటూ స్టార్ మా ఈ ప్రోమోను షేర్ చేసింది.
ఈ వారాంతం స్టార్ మా ఛానల్‌లో వినోదం పండుగ. అన్ని రకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మిస్ చేసుకోకండి!


