
📌 Key Points
- విశ్వక్సేన్, కయదు లోహర్ జంటగా రొమాంటిక్ కామెడీ ఫంకీ మూవీ!
- ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఫంకీ చిత్రం.
- నెట్‌ఫ్లిక్స్‌లో ఫంకీ మూవీ విడుదల కానుందని సమాచారం!
- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాకి రూ. 15 కోట్ల బడ్జెట్!
విశ్వక్సేన్ నటించిన ఫంకీ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 13న విడుదలైన ఫంకీ మూవీ
అనుదీప్, విశ్వక్సేన్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ మూవీ ఫంకీ ఓటీటీ రిలీజ్ (Funky OTT Release Date) డేట్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ వచ్చే వారమే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన సినిమా ఫంకీ. విశ్వక్సేన్, కయదు లోహర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజైనా ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సినిమా!
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఫంకీ సినిమాను నిర్మించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించాడు.
విశ్వక్సేన్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్, కయదు లోహర్‌తోపాటు వీకే నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్, టెక్నిషియన్స్ రెమ్యూనరేషన్ ఇతరత్రా ఖర్చులంతా కలిపి ఫంకీ సినిమాకు మొత్తంగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. ఇండియాలో రూ.9 కోట్ల వరకు నెట్ వసూళ్లు సాధించింది.
ఫంకీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


