|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరోజే గ్రాండ్‌గా గామా అవార్డ్స్ వేడుకలు- దుబాయ్‌లో థీమ్ సాంగ్ లాంచ్- పాల్గొనే హీరో హీరోయిన్స్ వీళ్లే!

Published: 25-06-2025, 10:12 AM
ఆరోజే గ్రాండ్‌గా గామా అవార్డ్స్ వేడుకలు- దుబాయ్‌లో థీమ్ సాంగ్ లాంచ్- పాల్గొనే హీరో హీరోయిన్స్ వీళ్లే!

ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ 2025 వేడుకలు దుబాయ్‌లో ఆగస్టు 30న జరుగనున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్‌లోని అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు. ఇప్పటికే థీమ్ సాంగ్ లాంచ్ చేశారు.

Key Points

1

దుబాయ్‌లో ఆగస్టు 30న గామా అవార్డ్స్ 5వ ఎడిషన్ గ్రాండ్‌గా జరుగుతోంది.

2

సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం వంటి టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటున్నారు.

4

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రచించిన థీమ్ సాంగ్ లాంచ్ ఇప్పటికే జరిగింది.

గామా అవార్డ్స్ 2025: వేడుక వివరాలు

ప్రతిష్టాత్మకమైన గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ దుబాయ్‌లో ఇప్పటికీ నాలుగు ఎడిషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. తాజాగా 2025- ఐదో ఎడిషన్ వేడుకలు దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆగస్ట్ 30న వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌ లో రీసెంట్‌గా జరిగిన కీన్‌ఫ్రా ప్రాపర్టీస్ (Keinfra Properties) ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5వ ఎడిషన్‌ థీమ్ సాంగ్‌ను లాంచ్ చేశారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ , తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు , రోషన్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి , దక్ష నాగర్కర్‌తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొననున్నారు. అలాగే, అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌటేలా, కేతిక శర్మ , ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫామెన్స్‌లతో అలరించనున్నారు.

ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్ , బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవీ శ్రీ ప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిశోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్‌ప్రైజ్ గెస్ట్‌లుగా హాజరు కానున్నారు.

పాల్గొనే ప్రముఖులు

అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ 24 క్రాఫ్ట్స్‌కు గామా అవార్డ్స్‌ను అందించనున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో నామినేట్ అయిన విభాగాలకు పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు.

ఈ గామా అవార్డ్స్ 2025లో ఈ ఏడాది కూడా పలు పాపులర్ చిత్రాలు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, టాప్ టెక్నీషియన్స్ పురస్కారాలు అందుకోనున్నారు. ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను దుబాయ్‌లో నిర్వహించగా అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రి ఫార్మ్‌లో గామా అవార్డ్స్ 5వ ఎడిషన్‌ టిక్కెట్లను మహిళలు విడుదల చేశారు.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ సినీ దర్శకులు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు గామా అవార్ద్స్ బహుకరించనున్నారు.

థీమ్ సాంగ్ లాంచ్

ఈ సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ.. “దుబాయ్‌లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరిగే 5వ ఎడిషన్‌ను కూడా మన తెలుగు వారు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి” అని అన్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ.. “వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించనున్నాం. విశాలవంతమైన పార్కింగ్ కలిగిన షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో 10 వేల మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు.

“వినూత్న రీతిలో జరగబోయే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, అందర్నీ అలరించే వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలు ఉంటాయి” అని సౌరభ్ కేసరి పేర్కొన్నారు.

అతిథులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన ఈ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుందని అంచనా. టాలీవుడ్ అభిమానులకు ఇది ఒక అద్భుతమైన అనుభవం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.