
బిగ్ బాస్ తెలుగు అగ్నిపరీక్షలో సామాన్యుల ఎంపిక ప్రక్రియలో కేతమ్మ తన జీవిత కథతో అందరినీ కదిలించింది. అయితే, ఆమె ప్రయాణం అనుకున్నట్లుగా సాగలేదు.
Key Points
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కేతమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కష్టాలను ఎదుర్కొన్న తన జీవిత అనుభవాలను పంచుకుంది కేతమ్మ.
జడ్జిల నుండి షాకింగ్ రెడ్ కార్డ్ తో కేతమ్మ ఎలిమినేట్ అయింది.
గంగవ్వ వలెనే కేతమ్మ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయింది.
కేతమ్మ అగ్నిపరీక్ష ఎంట్రీ
సామాన్యులకు కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే సామాన్యనులను సెలక్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే ‘అగ్నిపరీక్ష’. ఈ పరీక్ష ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయ్యేవారిని సెలక్ట్ చేయబోతున్నారు. మొత్తంగా 45 మంది ఈ అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. అందులో రెండు మూడు వడపోతలు తరువాత ఫైనల్ గా 5 విన్నర్స్ కు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి వెళ్లే అవకాశం కల్పించబోతున్నారు.
బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ ఫస్ట్ ఎసిపోడ్ లో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లు స్టేజ్ పై సందడి చేశారు.అందులో గంగవ్వ వయసున్న కేతమ్మ ఈ ఎపిసోడ్ కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తలపై బోనం ఎత్తుకున్నట్లుగా ఆమె ఎంట్రీ అదిరిపోయింది. నల్లగొండ దగ్గర తొండ తిరుమలగిరి తమ ఊరని చెపుతూనే కష్టపడ్డ సార్.. నా చిన్నబిడ్డ నన్ను నా భర్తని సాకుతది.. నా భర్తకి పక్షవాతం వచ్చింది సార్.. ఈ జన్మకి నాకు ఇంతే చాలు మిమ్మల్ని అందర్నీ కలిసిన.. అంటూ కేతమ్మ చెప్పిన మాటలు అందర్నీ ఎమోషనల్ చేశాయి. జీవితంలో అన్నీ కష్టాలు చూశానని, అందరిని నవ్వించడం తనకు ఇష్టం అనిచెప్పింది కేతమ్మ.
జడ్జిల తీర్పు
అంత పెద్ద వయస్సులో ఆమె ప్రయత్నం అందరిని కదిలించింది. అయితే ఇక్కడే ఆమెకు చిన్న ట్విస్ట్ ఇచ్చారు జడ్జెస్. అభిజిత్ మాట్లాడుతూ.. . ‘మీరు జీవితంలో చూసినంత సగం నేను చూడలేదమ్మా. కానీ ఆట నేను చూశా. చాలా కష్టంగా ఉంటుందవ్వా మీకు’ అంటూ అభిజిత్ చెప్పగా… ‘నాకు తోచినంత ఆడతా. మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్లనైనా కొట్టుకొస్తా.’ అంటూ కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చింది కేతమ్మ.
అటు నవదీప్ కూడా గతంలో గంగవ్వ హౌస్ లోకి వచ్చి ఇలానే చెప్పింది. కాని ఉండలేకపోయింది. అనారోగ్యం చాలా ఇబ్బందిపెట్టింది. అని చెపుతూ.. నీకు ఈ బిగ్ బాస్ కరెక్ట్ కాదమ్మ. నువ్వు ఉండలేవు అంటూ ముగ్గురు జడ్జ్ లు రెడ్ కార్డ్ చూపించారు. దాంతో కేతమ్మ సెలక్ట్ కాకుండా వెనుతిరగాల్సి వచ్చింది.
గంగవ్వతో పోలిక
ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ రెండు సార్లు బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి వెళ్ళింది. కాని రెండు సార్లు ఆమె అక్కడ ఉండలేకపోయింది. మొదటిసారి తన ఫ్యామిలీని మిస్ అవుతున్నానంటూ.. అందరు గుర్తుకు వస్తున్నారు, ఏసీ పడటంలేదు అని రకరకాల కారణాలతో బయటు వెళ్లిపోయిన గంగవ్వ.. ఆతరువాత మరోసారి రీసెంట్ గా సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. కాని అప్పుడు కూడా ఆమెను అవే సమస్యలు వెంటాడాయి. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది గంగవ్వ. మధ్యలోనే బయటకు వచ్చేసింది.
కేతమ్మ అగ్నిపరీక్షలో తన ధైర్యాన్ని చూపించినప్పటికీ, జడ్జిల నిర్ణయంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. గంగవ్వ అనుభవాలతో పోల్చినప్పుడు, ఆమె అనుభవం భిన్నంగా ఉంది.


