|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Geeta Singh : గీతా సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కితకితలు సినిమాకు ఎంత ఇచ్చారో తెలుసా?

Published: 04-09-2025, 2:36 AM

ప్రముఖ నటి గీతా సింగ్ తన సినిమా జీవితం, ముఖ్యంగా ఆమె మొదటి సినిమా ‘జై’ మరియు సూపర్ హిట్ సినిమా ‘కితకితలు’కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించింది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.

Key Points

1

గీతా సింగ్ తన మొదటి సినిమా 'జై'కి 10,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంది.

2

కితకితలు సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండానే నటించింది.

4

సినిమా విజయం తర్వాత దర్శకుడు ఆమెకు 2.5 లక్షలు ఇచ్చాడు.

గీతా సింగ్ మొదటి సినిమా అనుభవం

Geeta Singh : కితకితలు సినిమాతో ఫేమ్ తెచ్చుకుంది గీతా సింగ్. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించింది. కితకితలు తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటించింది కానీ పలు కారణాలతో సినిమాలకు దూరమైపోయింది. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది గీతా సింగ్.(Geeta Singh)

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన మొదటి సినిమా రెమ్యునరేషన్ తో పాటు కితకితలు రెమ్యునరేషన్ గురించి చెప్పింది.

కితకితలు సినిమా విజయం మరియు రెమ్యునరేషన్

గీతా సింగ్ మాట్లాడుతూ..నా మొదటి సినిమా తేజ గారితో ‘జై’ సినిమా చేసాను. ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి కాలేజీ చదువుతున్నాను. తేజ గారంటే కొడతారు అని అప్పట్లో అందరికి భయం. సినిమాలో ఒక సీన్ లో నేను వేరే నటుడి చెయ్యి పట్టుకొని కొరకాలి. ఆ సీన్ లో నేను నిజంగా కొరికేశా, సెట్ అంతా అందరూ నవ్వేశారు. కట్ చెప్పకుండా నవ్వుతూనే ఉన్నారు నేను చేసిన యాక్టింగ్ కి. ఆ విషయం ఇండస్ట్రీలో తెలిసి ఇవివి సత్యనారాయణ గారు పిలిచి ఎవడిగోల వాడిదేలో అవకాశం ఇచ్చారు. జై సినిమాకు నాకు పదివేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పట్లో నాకు అది చాలా ఎక్కువ అని తెలిపింది.

గీతా సింగ్ సినిమా జీవితం

అలాగే కితకితలు సినిమా రెమ్యునరేషన్ గురించి చెప్తూ.. అసలు ఆ సినిమాకు నేను రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాని బడ్జెట్ కేవలం 60 లక్షలు మాత్రమే. థియేటర్స్ మీద వచ్చిందే కాకుండా అప్పట్లోనే జెమిని టీవీ కితకితలు సినిమాకు 8 కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంది. దాంతో సినిమా అయ్యాక నన్ను పిలిచి డైరెక్టర్ రెండున్నర లక్షలు ఇచ్చారు. నేను వద్దన్నా కూడా ఇచ్చారు అని తెలిపింది.

గీతా సింగ్ తన సినిమా ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఈ కథనం వివరిస్తుంది. కితకితలు సినిమా ఆమె జీవితంలో ఒక మలుపు అని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.