|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ 10: అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ రికార్డ్ బ్రేక్! ఒక్క సీజన్‌కు అన్ని కోట్లా? షాకింగ్ న్యూస్!

Published: 15-02-2026, 11:35 PM
బిగ్ బాస్ 10: అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ రికార్డ్ బ్రేక్! ఒక్క సీజన్‌కు అన్ని కోట్లా? షాకింగ్ న్యూస్!
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 10: హోస్ట్‌గా నాగార్జున రెమ్యునరేషన్ పెంపు – ఒక్కో ఎపిసోడ్‌కు భారీగా ఛార్జ్!
  • గత ఏడు సీజన్లకు రూ.200 కోట్ల పారితోషికం అందుకున్న నాగార్జున – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • సినిమాల కంటే బిగ్ బాస్ హోస్టింగ్‌కే ఎక్కువ డిమాండ్? – నాగార్జున కొత్త రికార్డ్!
  • సీజన్ 10 కోసం నాగార్జున రూ.40 కోట్లు డిమాండ్? – అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు!

కింగ్ నాగార్జున మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన రెమ్యునరేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!

నాగార్జున హోస్టింగ్‌కు ఎంత డిమాండో తెలుసా?

తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ 2017లో ప్రసారం అయింది. ఆ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన హోస్టింగ్‌కు మంచి స్పందన లభించింది. అయితే సినిమాలు ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. నాని హోస్టింగ్‌కు మిశ్రమ స్పందన లభించడంతో పాటు విమర్శలు కూడా వినిపించాయి. దాంతో ఆయన హోస్టింగ్ కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు.

ఇక గతంలో మీ లో ఎవరు కోటీశ్వరుడు? కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునను సీజన్ 3 నుంచి బిగ్ బాస్ హోస్ట్‌గా కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి ఆయన వరుసగా షోను నడిపిస్తున్నారు. నాగార్జున సారథ్యంలో షో మంచి టీఆర్పీలు సాధిస్తోంది. సీజన్ 6 మినహా మిగతా అన్ని సీజన్లు విజయవంతమయ్యాయని సమాచారం. ముఖ్యంగా సీజన్ 7తో పాటు గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్లాక్‌బస్టర్ రేటింగ్స్ సాధించింది. దీంతో నాగార్జున హోస్టింగ్ కు డిమాండ్ మరితగా పెరిగింది. కింగ్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినట్టు సమాచారం.

సినిమాలనే మించిన బిగ్ బాస్ క్రేజ్!

ఈ క్రమంలో బిగ్ బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గత ఏడు సీజన్లకు కలిపి నాగార్జున దాదాపు రూ.200 కోట్ల వరకూ పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే సగటున ఒక్కో సీజన్‌కు సుమారు రూ.28 కోట్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది ఆయన సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమాల్లో ఆయన మార్కెట్ రీత్యా రూ.20 కోట్లకు తగ్గ పారితోషికమే తీసుకుంటున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్ హోస్ట్‌గా దాదాపు ముప్పై కోట్ల వరకు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత లేదు.

సీజన్ 10 కోసం నాగ్ కొత్త డీల్!

ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతం కావడంతో నాగార్జున తన రెమ్యునరేషన్‌ను మరింత పెంచినట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం దాదాపు రూ.40 కోట్ల వరకు తీసుకోబోతున్నారని టాక్. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు షోను బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

సాంప్రదాయవాదులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హోస్ట్‌గా నాగార్జున కూడా విమర్శల పాలవుతున్నారు. రెమ్యునరేషన్, కంటెస్టెంట్ల వివరాలపై స్పష్టత రానప్పటికీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10పై ఆసక్తి మాత్రం పెరుగుతోంది. షో మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. నాగార్జున హోస్టింగ్‌లో ఈ సీజన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తాజా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.