|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Genelia Deshmukh: సౌత్‌ ఇండస్ట్రీకి రుణపడి ఉన్నా.. యాంకర్‌కు చెంపపెట్టు సమాధానం!

Published: 19-06-2025, 6:58 AM
Genelia Deshmukh: సౌత్‌ ఇండస్ట్రీకి రుణపడి ఉన్నా.. యాంకర్‌కు చెంపపెట్టు సమాధానం!

జెనీలియా దేశ్ ముఖ్ తన సినిమా జీవితం గురించి, ముఖ్యంగా దక్షిణాది సినిమా పరిశ్రమలో తన అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె ‘రెడీ’ సినిమా హిందీ రీమేక్‌పై, మరియు ఒక యాంకర్ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

జెనీలియా దక్షిణాది సినిమా పరిశ్రమకు రుణపడి ఉందని, అక్కడే తనకు మంచి పాత్రలు దక్కాయని అన్నారు.

2

‘రెడీ’ సినిమా హిందీ రీమేక్‌లో తనను ఎంచుకోకపోవడం గురించి ఆమె స్పందించారు.

4

సౌత్ ఇండస్ట్రీలో తనకు దక్కిన అవకాశాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

జెనీలియా యొక్క సౌత్ సినిమా జర్నీ

జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ‍ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్‌.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్‌ అయ్యాయి కూడా! అందులో రామ్‌పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో రీమేక్‌ చేశారు. కానీ హీరోయిన్‌గా జెనీలియా ( Genelia D’Souza )కు బదులుగా అసిన్‌ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్‌ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.

ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో.. సితారే జమీన్‌ పర్‌ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్‌లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్‌.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్‌తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.

‘రెడీ’ హిందీ రీమేక్‌పై ఆమె అభిప్రాయం

రుణపడి ఉన్నా తర్వాత యాంకర్‌.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్‌లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్‌లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్‌కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు.

ఎంజాయ్‌ చేశా తమిళంలో హరిణి (సంతోష్‌ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్‌, రాజమౌళి వంటి టాప్‌ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్‌ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్‌ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్‌కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

యాంకర్ ప్రశ్నకు జెనీలియా సమాధానం

జెనీలియా తన సినిమా జీవితం గురించి, దక్షిణాది సినిమా పరిశ్రమకు తాను ఎంత రుణపడి ఉన్నానో తెలియజేశారు. యాంకర్ ప్రశ్నకు ఆమె సమర్థవంతంగా సమాధానం ఇచ్చి, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.