|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ghattamaneni: ఘట్టమనేని వారసుడు సినీ ఎంట్రీ ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (ట్వీట్)

Published: 31-05-2025, 7:37 AM
Ghattamaneni: ఘట్టమనేని వారసుడు సినీ ఎంట్రీ ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (ట్వీట్)

ప్రముఖ నటుడు కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ టాలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేయనున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

Key Points

1

ఘట్టమనేని జయకృష్ణ సినీ ప్రవేశం త్వరలోనే.

2

అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు.

4

సారా అర్జున్ హీరోయిన్‌గా నటించే అవకాశం.

జయకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభం

ఘట్టమనేని (Ghattamaneni) కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దివాంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మనవడు, రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ (Jayakrishna) హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు.. వైజయంతిపై అశ్వనీదత్ ఆనంది ఆర్ట్స్‌పై కిరణ్ నిర్మించనున్నారు.. ఇందులో హీరోయిన్‌గా సారా అర్జున్‌(Sara Arjun)ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. వచ్చే నెలలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనుంది. ఇక సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తోంది. కాగా.. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న వార్తలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నువ్వు కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

సూపర్ స్టార్ #Krishna గారి మనవడు Ramesh Babu తనయుడు #GhattamaneniJayakrisha హీరోగా డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు.. వైజయంతి పై అశ్వనీదత్ ఆనంది ఆర్ట్స్ పై కిరణ్ నిర్మించనున్నారు… #SaraArjun హీరోయిన్ గా అనుకుంటున్నారు. వచ్చే నెల ఎనౌన్స్ మెంట్…… pic.twitter.com/A8118KxEGu

సినిమా వివరాలు మరియు నటీనటులు

అధికారిక ప్రకటన ఎప్పుడు?

ఘట్టమనేని జయకృష్ణ సినీ ప్రవేశం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో విడుదలయ్యే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.