|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మేకప్ లేకపోయినా నేను సూపర్ స్టార్‌నే! నా అందం రహస్యం చెప్పిన గిరిజా ఓక్!

Published: 05-01-2026, 2:30 AM
మేకప్ లేకపోయినా నేను సూపర్ స్టార్‌నే! నా అందం రహస్యం చెప్పిన గిరిజా ఓక్!
  • గిరిజా ఓక్ తన సహజ సౌందర్యంతో యువతకి క్రష్ గా మారింది.
  • మేకప్ లేకుండానే ఎక్కువ మంది తనని ఇష్టపడతారని గిరిజ నమ్మకం.
  • సోషల్ మీడియా ద్వారానే ఆమెకి ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది.
  • మేకప్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదని భావించడం సరికాదంటున్న గిరిజ.

ఇంటర్నెట్ సంచలనం గిరిజా ఓక్ తన సహజసిద్ధమైన అందం, మేకప్ లేని లుక్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నారు. తనను ఎక్కువ మంది మేకప్ లేకుండానే ఇష్టపడతారని, తన అందం గురించి మాట్లాడుకునేవన్నీ నిజమేనని గిరిజ వెల్లడించారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గిరిజా ఓక్ – ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన వైనం

లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గిరిజా ఓక్ ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. యువతలో ఆమెకి పాపులారిటీ బాగా పెరిగింది. 38 ఏళ్ళ వయసులో యువతకి గిరిజా ఓక్ క్రష్ గా మారిపోయారు. ఆమె బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, సింపుల్ లుక్ లోనే అందంగా కనిపించడం ఇవన్నీ నెటిజన్లకు బాగా నచ్చేశాయి. దీనితో ఆమెకి సంబంధించిన దృశ్యాలని తెగ వైరల్ చేస్తున్నారు.

మరాఠీ నటి అయిన గిరిజా ఓక్ మరాఠీతో పాటు అనేక హిందీ చిత్రాల్లో కూడా నటించారు. దశాబ్దాలుగా ఆమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇటీవల మాత్రమే క్రేజ్ వచ్చింది. అది కూడా సోషల్ మీడియా వల్ల. గిరిజా ఎక్కువగా గ్లామర్ ప్రదర్శించరు. కానీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో నటించారు. లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో గిరిజా నటించారు.

మేకప్ లేని అందం: గిరిజా ఓక్ సీక్రెట్

గిరిజా ఓక్ ఎక్కువగా చేనేత చీరలు ధరిస్తూ అందంగా కనిపించడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ సీక్రెట్ ని గిరిజా రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. తనకి మేకప్ వేసుకోవడం అంతగా ఇష్టం లేదు అని.. కేవలం సినిమాల్లో నటించేటప్పుడు ఆ పాత్రకి తగ్గట్లుగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటాను అని గిరిజ తెలిపారు. అభిమానులు కూడా నన్ను ఎక్కువ మంది మేకప్ లేకుంటేనే ఇష్టపడతారు అని గిరిజ తెలిపింది.

చాలా మంది మేకప్ లేకుండా సింపుల్ లుక్ లోనే తాను అందంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాయి. సింపుల్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు గిరిజ పేర్కొంది. మేకప్ లేకపోతే కాన్ఫిడెన్స్ లేనట్లుగా భావించకూడదు. నోమెకప్ లుక్ తో కూడా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని గిరిజా పేర్కొంది.

నా గురించి అనుకునేవన్నీ నిజమే: గిరిజా ఓక్ ఫన్నీ కామెంట్స్

నేను అందంగా, క్యూట్ గా ఉంటాను, అమేజింగ్ పర్సన్ ని నేను.. ఇలా నా గురించి బయట మాట్లాడుకుంటున్న విషయాలు అన్నీ నిజం అంటూ గిరిజా ఫన్నీగా పేర్కొంది. గిరిజా చివరగా షారుఖ్ ఖాన్ జవాన్, ది వాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జండే లాంటి సినిమాల్లో నటించింది. సౌత్ నటుడు సందీప్ కిషన్ తో కలిసి గతంలో ఆమె షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో నటించింది.

గిరిజా ఓక్ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం, సహజ అందానికి అద్దం పడుతున్నాయి. మేకప్ అవసరం లేకుండానే తనని తాను ప్రేమించుకోవడం, ధైర్యంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆమె ఉదహరించారు. గిరిజ సందేశం అందరికీ ఆదర్శం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.