
📌 Key Points
- నదిలో స్విమ్మింగ్ చేస్తున్న యువతికి మొసలి తగలడంతో ఒక్కసారిగా షాక్.
- చేప అనుకుని పట్టుకోగా మొసలి కావడంతో భయంతో పారిపోయింది.
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా నదిలో స్విమ్మింగ్ చేస్తున్న యువతికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె మొసలిని చూసి భయంతో పారిపోయింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
నదిలో స్విమ్మింగ్ చేస్తున్న యువతికి షాక్
సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో వీడియోలు వైరల్ (Viral Video) అవుతున్నాయి. అలాంటి ఓ వైరల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. నదిలో హాయిగా స్విమ్మింగ్ చేస్తున్న ఓ యువతికి మొసలి షాక్ ఇచ్చింది. ఆ దెబ్బతో సదరు యువతికి ప్రాణాలు పోయినంత పనైంది. ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో వివరాలు తెలియనప్పటికీ వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. నదిలో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా కేరింతలు కొడుతున్న ఓ యువతికి తన కాళ్లకు ఏదో తగిలినట్లు అనిపించింది. ఏదో పెద్ద చేప అయి ఉంటుందని ఎంతో ఎగ్జైట్ అయింది.
అతే కుతూహలంతో దాన్ని చేతితో పట్టుకుని నీటిపైకి తీసింది. ముందు ఎలాంటి భయం లేకుండా నీటిలో నుంచి పైకి ఎత్తి దాని వైపు చూసే సరికి ఒక్క క్షణంలో గుండె ఆగినంత పనైంది. తాను పైకెత్తింది చేపను కాదు మొసలి పిల్ల చూసి ప్రాణభయంతో దాన్ని నీటిలోకి విసిరేసింది. ఎలైగానా బతికి బయటపడాలనే భయంతో పరుగుపరుగున నది ఒడ్డుకు చేరుకుంది. అయితే వ్యూస్ కోసం చేశారో.. లేక నిజంగా జరిగిందో తెలీదు గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో
నెటిజన్ల స్పందన
ఈ వీడియో నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఇది ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.


