
📌 Key Points
- జీమెయిల్ యూజర్లు ఇకపై తమ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు.
- పాత డేటా (ఈమెయిళ్లు, ఫైళ్లు, ఫోటోలు) సురక్షితంగా ఉంటాయి.
- మార్చిన యూజర్ నేమ్ ద్వారా కూడా పాత మెయిల్స్ పొందవచ్చు.
- ఈ ఫీచర్ దశలవారీగా విడుదల కానుంది.
గూగుల్ జీమెయిల్ వినియోగదారుల కోసం ఒక శుభవార్త. ఇకపై యూజర్లు తమ జీమెయిల్ యూజర్ నేమ్‌ను సులభంగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా మీ పాత డేటా ఏమాత్రం కోల్పోకుండా ఈ మార్పులు చేసుకోవచ్చు.
జీమెయిల్‌లో యూజర్ నేమ్ మార్పు ఎలా?
Gmail Username : గూగుల్ జీమెయిల్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. కొత్త అకౌంట్ అవసరం లేదు. పాత అకౌంట్ యూజర్ నేమ్ ఈజీగా మార్చుకోవచ్చు. ఎలాగంటే?
Gmail Username : గూగుల్ జీమెయిల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జీమెయిల్ ఫీచర్ రాబోతుంది. అతి త్వరలో ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు జీమెయిల్ ఐడీ (ఈమెయిల్ అడ్రస్)ని మార్చుకోవచ్చు. ఇప్పటివరకు @gmail.comతో ఉన్న ఐడీలకు అనుమతి లేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. 2004లో మీ జీమెయిల్ అడ్రస్ ఆ ఏడాదికి పరిమితం కాదు.
మీ ఈమెయిల్ అడ్రస్ [email protected] లేదా [email protected] మెయిల్స్ యూజర్ నేమ్ ఉంటే మీరు ఇప్పుడు మార్చుకోవచ్చు. మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్‌లకు వెళ్లి ఏదైనా ఒక పేరును ఎంచుకోండి. లేదంటే మీ పాత యూజర్‌నేమ్ అలాగే ఉంటుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో ఈ అప్‌డేట్‌ను షేర్ చేశారు.
మీరు రెండింటిలో దేనితోనైనా లాగిన్ అవ్వవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రస్తుత డేటాను కోల్పోకుండా కొత్త జీమెయిల్ ఐడీ మారవచ్చు. మీ ఈమెయిళ్లు, గూగుల్ డ్రైవ్ ఫైళ్లు, ఫొటోలు, ఇతర లింక్ సర్వీసులు గతంలో మాదిరిగానే సేఫ్ ఉంటాయి.
మీ పాత ఇమెయిల్ అడ్రస్ మీ అకౌంటుతో లింక్ అయి ఉంటుంది. అల్ట్రానేట్ అడ్రస్‌గా పనిచేస్తుంది. పంపిన ఇమెయిల్స్ పొందవచ్చు. దాంతో లాగిన్ అవ్వొచ్చు. ఈ ఫీచర్‌ను దశలవారీగా రిలీజ్ చేయనుంది.
Read Also : Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ S25 FE భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?
డేటా భద్రత గురించి గూగుల్ ఏమంటోంది?
జీమెయిల్ యూజర్లందరికి వెంటనే అందుబాటులోకి రాకపోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ను పొందిన యూజర్లు తమ సెట్టింగ్స్‌లోని “Google Account email” సెక్షన్‌కు వెళ్లి తమ జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.
ఈ మార్పుతో ‘Sign in With Google’ క్రోమ్ సింక్ వంటి సర్వీసులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అందుకే, వినియోగదారులు తమ ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.
You asked, we delivered. If you’re a U.S. Google user, you can now change your account username for tools like Gmail, Photos, Drive and more — while keeping your emails, data and account history. Here’s what to know:
1️⃣ You can choose any available @gmail .com username.
2️⃣… pic.twitter.com/eF2lgbJaFg
ఫీచర్ విడుదల ఎప్పుడు, ఎక్కడ?
— Google (@Google) March 31, 2026
జీమెయిల్ యూజర్లు తమ పాత ఇమెయిల్ ఐడీని యాక్సస్ చేయాలంటే. ఆ అడ్రస్ ఉపయోగించి 12 నెలల పాటు కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయలేరు. ఇప్పటివరకూ జీమెయిల్ యూజర్లకు కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం తప్పా ఫస్ట్ ఇమెయిల్ ఐడీని మార్చుకునేందుకు అవకాశం లేదు. ఈ అప్‌డేట్ ద్వారా తమ డేటాను కోల్పోకుండా వారి పాత ఐడీని ఈజీగా మార్చుకోవచ్చు.
కొత్త ఫీచర్ ఎవరు వాడొచ్చంటే? : ప్రస్తుతం అమెరికాలోని యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఫీచర్ భారతీయ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
గూగుల్‌లో మీ యూజర్‌నేమ్‌ను ఎలా ఎడిట్ చేయాలి? : మీ జీమెయిల్ యూజర్‌నేమ్‌ను అప్‌డేట్ చేసేందుకు ఈ కింద విధంగా ట్రై చేయండి.
ఒకసారి అప్‌డేట్ చేశాక మీ కొత్త యూజర్‌నేమ్ సపోర్ట్ చేసే అన్ని గూగుల్ సర్వీసులలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, మీ పాత యూజర్‌నేమ్ అలియాస్‌గా అలానే వర్క్ అవుతుంది.
జీమెయిల్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండనుంది. పాత డేటాను కోల్పోకుండా యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం రావడం నిజంగా అభినందించదగ్గ విషయం.


