
📌 Key Points
- గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ హిస్టరీని ట్రాక్ చేస్తుందని మీకు తెలుసా?
- మీ గోప్యతను కాపాడుకోవడానికి లొకేషన్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేయడం చాలా ముఖ్యం.
- ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్‌లో లొకేషన్ డేటాను సులభంగా డిలీట్ చేయవచ్చు.
- పాత లొకేషన్ హిస్టరీని డిలీట్ చేయడానికి ఆటో-డిలీట్ ఆప్షన్‌ను ఉపయోగించండి.
గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక! గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ హిస్టరీని రహస్యంగా సేవ్ చేస్తోంది. మీ గోప్యతను కాపాడుకోవడానికి ట్రాకింగ్‌ను ఎలా ఆపాలో తెలుసుకోండి.
గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ట్రాకింగ్ ఎలా పనిచేస్తుంది?
Google Maps : గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ హిస్టరీని సేవ్ చేస్తుంది. ఇంతకీ ఎలా ఆఫ్ చేయాలి? పాత డేటాను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Google Maps : మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే, ఇది మీకోసమే. మీరు గూగుల్ మ్యాప్స్ వాడే సమయంలో మీ లొకేషన్ హిస్టరీ గూగుల్ సేవ్ చేస్తుంది తెలుసా? చాలావరకూ మీకు తెలియకుండానే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేస్తుంటుంది.
చాలావరకూ మీ లొకేషన్‌కు సంబంధించిన డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ చేస్తుంది. ‘లొకేషన్ హిస్టరీ’ ఫీచర్ ద్వారా గూగుల్ మీ లొకేషన్‌లు, రూట్‌లు, టైమ్‌లైన్‌ను రికార్డ్ చేస్తుంది. తద్వారా మీకు ట్రావెల్ హిస్టరీ, కస్టమైజడ్ ఇండికేషన్లు, మెరుగైన నావిగేషన్‌ను అందిస్తుంది.
అయితే, ప్రతి కదలిక రికార్డు సేవ్ అవ్వడాన్ని అందరూ ఇష్టపడరు కాబట్టి, ఇది చాలా మంది వినియోగదారులకు గోప్యతా సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, గూగుల్ మీ లొకేషన్ హిస్టరీని సేవ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే, దానిని ఆఫ్ చేయడం ఒక ముఖ్యమైన సెట్టింగ్ కావచ్చు. మంచి విషయం ఏమిటంటే, మీరు దీన్ని కొన్ని సులభమైన దశల్లోనే నియంత్రించవచ్చు.
లొకేషన్ హిస్టరీని ఎలా ఆఫ్ చేయాలి?
ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో ఎలా లొకేషన్ డేటా డిలీట్ చేయాలంటే? :
ఆ తర్వాత, గూగుల్ మీ కొత్త లొకేషన్ హిస్టరీని ఇకపై సేవ్ చేయదు. అయితే, మీ పాత లొకేషన్ హిస్టరీ మాత్రం అలాగే ఉంటుంది. మీరు ఆ పాత డేటా కూడా డిలీట్ చేయొచ్చు.
Read Also : WhatsApp Noise Cancellation : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక ట్రాఫిక్‌లో ఉన్నా కాల్స్ క్లారిటీగా వినిపిస్తాయి.. ఎలాగంటే?
పాత లొకేషన్ డేటాను డిలీట్ చేయడం ఎలా?
పాత లొకేషన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి? :
‘Delete all Timeline Data’పై ట్యాప్ చేసి నిర్దిష్ట తేదీని లేదా రేంజ్ కూడా డిలీట్ చేయొచ్చు. ఆటో-డిలీట్ టైమ్‌లైన్ ఆప్షన్ కూడా ఉంది. నిర్దిష్ట సమయం తర్వాత లొకేషన్ ఆటోమాటిక్‌గా డిలీట్ చేస్తుంది.
లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేయడం వల్ల టైమ్‌లైన్, కొన్ని కస్టమైజడ్ ఫీచర్‌లు పనిచేయవు. గూగుల్ ఇప్పటికీ ఇతర సెట్టింగ్‌ల వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ద్వారా లొకేషన్ డేటాను యాక్సస్ చేస్తుంది.
గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవచ్చు. మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చర్యలు తీసుకోండి.


