
📌 Key Points
- గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
- ఈ ఫోన్ అసలు ధర రూ. 1,24,999 కాగా, ఇప్పుడు తక్కువ ధరకే పొందవచ్చు.
- HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొంటే అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
- పిక్సెల్ 9 ప్రో XLలో ట్రిపుల్ కెమెరా సెటప్, టెన్సర్ చిప్‌సెట్ ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. డిస్కౌంట్ తో మీ బడ్జెట్ లోనే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL పై భారీ డిస్కౌంట్
Google Pixel 9 Pro XL : కొత్త గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్‌లో అసలు ధర నుంచి డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఇంకా ధర తగ్గాలంటే ఇలా చేయండి.
Google Pixel 9 Pro XL : మీరు పిక్సెల్ అభిమాని అయితే.. ఇది మీకోసమే.. కొత్త పిక్సెల్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుత గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL డీల్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 19వేలకు పైగా భారీ తగ్గింపుతో లభిస్తోంది.
రూ. 1,24,999 ధరతో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్‌లో (Google Pixel 9 Pro XL) ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్, గూగుల్ టెన్సర్ చిప్‌సెట్, 5,060mAh బ్యాటరీ ఉన్నాయి. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
పిక్సెల్ 9 ప్రో XL ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ రూ. 1,24,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 1,09,000కు లభిస్తోంది. రూ. 15,999 నేరుగా ధర తగ్గింది. అంతేకాదు.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ట్రేడ్-ఇన్ చేయవచ్చు.
Read Also : Motorola Edge 70 Pro : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ ఇదిగో.. ఫీచర్లు మాత్రం కేక..!
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,060mAh బ్యాటరీ కూడా ఉంది.
కొనాలా? వద్దా? నిపుణుల అభిప్రాయం
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో XLలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 42MP కెమెరా కూడా ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL : కొనాలా? వద్దా? : మీరు ఏఐ, ఫొటోగ్రఫీ కోసం మంచి స్మార్ట్‌ఫోన్ కావాలంటే గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL కొనేసుకోవచ్చు. పవర్ ఫుల్ ట్రిపుల్-కెమెరా సెటప్, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్, కొన్ని AI టూల్స్ కూడా అందిస్తుంది. అయినా ఈ ఫోన్‌ను అందరికీ సిఫార్సు చేయలేం. ఎందుకంటే ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి.
ఈ పిక్సెల్ ఫోన్ అసలు ధర రూ. 1.25 లక్షలు కాగా మార్కెట్‌లో అత్యంత ఖరీదైన అల్ట్రా-ప్రీమియం ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుత డిస్కౌంట్‌తో కూడా, ధర ఇప్పటికీ రూ. 1 లక్షకు పైగానే ఉంది. ఏఐ ఫీచర్లతో పిక్సెల్ ఫోన్ కావాలంటే కొనేసుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ ధరలో కావాలంటే ఏదైనా మెగా సేల్ అయితే తప్ప ఇప్పట్లో తగ్గదు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఇప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మంచి కెమెరా మరియు ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ కొనడానికి ఇది మంచి సమయం. వెంటనే అమెజాన్‌లో కొనుగోలు చేయండి.


