|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గోవు పూజ: ఎంత పుణ్యం? ప్రదక్షిణల ఫలితాలు!

Published: 19-06-2025, 9:45 PM

గోవును ఆరాధ్య దైవంగా భావించే సంప్రదాయం మనదేశంలో ఎప్పటినుండో ఉంది. గోవు పూజ, ప్రదక్షిణలు చేయడం వల్ల లభించే పుణ్యం గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఈ విషయాల గురించి వివరించారు.

Key Points

1

గోవు పూజ వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది.

2

వివిధ సమయాల్లో గోవు పూజకు విభిన్న ఫలితాలు.

4

గోవు వర్ణన ద్వారా పాపాల నుండి విముక్తి.

గోమాత యొక్క గొప్పతనం

గోవు మనందరికీ ఆరాధ్యదైవం. గోవుని నిత్యం ఏదో సందర్భంలో మనం పూజిస్తూనే ఉంటాం. గోవును మనం మాతగా పిలుచుకుంటాం. మన ఇంట ఎటువంటి శుభకార్యమైనా గోమాత ప్రస్తావన వచ్చి తీరుతుంది. అంతటి గోమాత గొప్పతనాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోమాత గొప్పతనాన్ని తెలుసుకోండి

గోవు పాదాలు పితృదేవతలు . గొలసి తులసీమార్గాన వెలసిన వల జ్ఞానం. గంగ నాథనీడు ఉన్నాడు. గద ధారముంది. మొగము జ్యేష్ఠము. కన్నులు అగ్రదేవతలు. చెవులు శంఖనాదములు. మూపురం విష్ణుదేవుని బోలు. బొడ్డు తామర కమలాల బోలు. నడుము నారదుని బోలు.

పక్కలు పరమేశ్వరుని బోలు. పిక్కలు పిడుగంటిని బోలు. తోలు యముణ్ణి బోలు. తోక వింజామర బోలు. కరివి కామాక్షిని బోలు. పొదుగు పుండరీకాక్షుని బోలు. సన్ను కట్టు సప్తసాగరాలు. పాలు పంచామృతాలు. పంచామృతాలలో ఉన్న భాగ్యవతి. భాగ్యవతిలో ఉన్న గోమయం. గోమయంలో ఉన్న గోపాలకృష్ణమూర్తి వారు.

వివిధ సమయాల్లో గోవు పూజ

గోపాలకృష్ణమూర్తి వారి భార్య రుక్మిణీ దేవి. శ్రీరాముల వారి భార్య సీతా దేవి. ధర్మరాజు గారి భార్య ద్రౌపదీ దేవి. ఈశ్వరుని భార్య పార్వతీ దేవి. బ్రహ్మదేవుని భార్య సరస్వతీ దేవి.

గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా?

వీరంతా కొలువై కూర్చుండగా, శ్రీకృష్ణమూర్తి వారిని స్త్రీలు చేసిన పాపం ఎలా పోవునయ్యా? అని అడిగితే.. ఎరిగి చేసిన పాపం, ఎరక్క చేసిన పాపం, తల్లిదండ్రులను దూషించిన పాపం, అత్తమామలను నిందించిన దోషం, పురుషుడిని నిందించిన దోషం , పుత్రులను ఎడబాపిన పాపం, అంటుముట్టు ఇంట కలిపిన పాపం, ఆడపిల్లని అమ్మిన దోషం. ఇన్ని దోషాలు ఒకసారి గోవుని వర్ణిస్తే పోవునని చెప్పెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ప్రదక్షిణల ప్రాముఖ్యత

గోవుని వర్ణించిన వనిత వస్తోంది. వజ్రతుండి పురుగులు ఏరించండి. యమకింకరులను విసిరించండి. యమద్వారములు మూయించండి. స్వర్గద్వారములు తెరిపించండి. సన్మార్గియైన స్త్రీ వస్తోంది. తనువు విడిచి కవి వస్త్రాలు ధరించి వస్తోంది. పొద్దున్న లేచి ఒకసారి గోవుని పూజిస్తే, కాశీలో ముమ్మారు స్నానం చేసినంత పుణ్యం.

మధ్యాహ్నకాలాన గోవుని పూజిస్తే, అగ్నివంటి కష్టములు, కొండవంటి ఆపదలు లేవని, సాయంత్ర కాలాన గోవుని పూజిస్తే, కోటిదేవాలయములలో దీపారాధన చేసినంత ఫలితమని చెప్పెను. గోవు ప్రణవ సమయమున, తవ్వెడు బియ్యము, డబ్బు ఒడిలో పోసుకుని ముమ్మారు ప్రదక్షిణ చేస్తే, ఇంతా అంతా ఫలితం కాదని శ్రీకృష్ణమూర్తి వారు చెప్పెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000

గోవు పూజ ద్వారా పుణ్యం పొందవచ్చు. ప్రదక్షిణలు, గోవు వర్ణన వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి. భక్తితో గోమాతను సేవించడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.