|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో దూసుకుపోతున్న 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ జాట్ – రిలీజైన రెండో రోజే టాప్ 1లో ట్రెండింగ్ – 2 భాషల్లో స్ట్రీమింగ్

Published: 07-06-2025, 12:56 AM
ఓటీటీలో దూసుకుపోతున్న 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ జాట్ - రిలీజైన రెండో రోజే టాప్ 1లో ట్రెండింగ్ - 2 భాషల్లో స్ట్రీమింగ్

120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జాట్’ సినిమా ఓటీటీలో అద్భుతమైన ప్రతిస్పందనను అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన రెండో రోజుకే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.

Key Points

1

120 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన యాక్షన్ థ్రిల్లర్ 'జాట్'

2

నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన రెండో రోజే టాప్ ట్రెండింగ్ లో నిలిచింది

4

గోపీచంద్ మలినేని దర్శకత్వం, సన్నీ డియోల్ ప్రధాన పాత్ర

జాట్: ఓటీటీలో సంచలన విజయం

థియేటర్లలో సినిమాల ఫలితాలకు, ఓటీటీలో రెస్పాన్స్‌కు చాలా తేడా ఉంటోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలకు దాదాపుగా ఓటీటీలో ఆదరణ బాగానే ఉంటోంది. కొన్నిసార్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఓటీటీ లో ట్రెండింగ్ అవుతుంటాయి.

అలాగే, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించుకున్న సినిమాలు సైతం ఓటీటీలో టాప్ ప్లేసుల్లో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆ మూవీనే జాట్. హిందీలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

మాస్ మహారాజా రవితేజ తో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ అందించిన గోపీచంద్ మలినేని చివరిగా తెలుగులో నందమూరి బాలకృష్ణతో వీర సింహా రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమానే జాట్. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించారు.

నెట్‌ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ సినిమా

అలాగే, ఈ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటించిగా అతనికి భార్యగా నెగెటివ్ షేడ్స్‌లో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా చేసింది. వీరితోపాటు సయామీ ఖేర్, ఆయేషా ఖాన్ వంటి హీరోయిన్స్‌తోపాటు బిగ్ బాస్ బ్యూటి దివి వాద్యా కూడా కీలక పాత్రలు పోషించింది.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై సుమారుగా రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో 120 కోట్ల యాక్షన్ థ్రిల్లర్‌ మూవీగా నిలిచిన జాట్ ఓటీటీలో అదరగొడుతోంది. జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు (జూన్ 6) ఉదయం నుంచే అంటే రెండో రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో దూసుకుపోతోంది.

హిందీ, తెలుగు లో స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో జాట్ నిలిచి అదరగొడుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 6.4 రేటింగ్ సాధించుకున్న జాట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తెలుగు రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక జాట్ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. థియేటర్లలో మిస్ అయిన జాట్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌ లో ఎంచక్కా చూసేయండి.

చివరగా, థియేటర్లలో మంచి కలెక్షన్స్ సాధించిన జాట్ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో దాని విజయం అభిమానులకు పండగే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.