|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Published: 10-06-2025, 1:21 PM
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

చాలాకాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారు.

Key Points

1

పవన్ కళ్యాణ్ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు.

2

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్.

4

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలు.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం

చాలా ఏళ్ళ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ లో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇక ఈసినిమా ఇక ఉండదు అని చాలా రూమర్లు వినిపించిన క్రమంలో.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో పాటు పవన్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు.

చాలా రోజుల విరామం అనంతరం ఈ సినిమా తాజాగా ఫుల్ లెంగ్త్ షెడ్యూల్‌కు సిద్ధమైంది. జూన్ 10న హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ తిరిగి స్టార్ట్ చేశారు. ప్రారంభ దశలో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను షూట్ చేస్తూ వచ్చారు టీమ్. ఇక తాజా సమాచారం మేరకు, పవన్ కళ్యాణ్ జూన్ 12 లేదా 13న ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నాడు. తాజా షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు కొనసాగనుంది.

పవన్ కళ్యాణ్ సినిమాలో చేరిక

ఇదివరకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి వంటి ప్రాజెక్టుల షూటింగ్‌లను పూర్తిచేసిన తర్వాత, ఇప్పుడు పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే కొన్ని పాటల కంపోజిషన్ పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.

సినిమా విడుదల తేదీ

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ పెద్ద హిట్ కావడంతో, ఈ చిత్రంపై ఆసక్తి మరింతగా పెరిగింది.ఈ సినిమా తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ తో ఈ సినిమా మరో పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.