|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, రణబీర్, యష్ లుక్స్ ఎలా ఉన్నాయంటే

Published: 03-07-2025, 6:47 AM
రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, రణబీర్, యష్ లుక్స్ ఎలా ఉన్నాయంటే

రణబీర్ కపూర్ మరియు యష్ నటించిన రామాయణం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ విడుదలయ్యాయి. ఈ పోస్టర్ మరియు టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీలు కూడా ప్రకటించారు.

Key Points

1

రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటించిన రామాయణం ఫస్ట్ లుక్ విడుదల.

2

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 850 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.

4

హాన్స్ జిమ్మెర్ మరియు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

రామాయణం ఫస్ట్ లుక్ విడుదల

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో విడుదలయ్యాయి. ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణ్‌బీర్ రాముడిలా కనిపిస్తున్నాడు. ఆయన లుక్ చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక విల్లుతో యోధుడిలా కనిపిస్తున్న రణ్ బీర్ కపూర్ వెనకాల అడవి, సూర్యుడు, మేఘాలతో అద్భుతంగా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు.

రణ్‌బీర్‌తో పాటు యష్ కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో యష్ రావణాసురుడు గా నటిస్తున్నాడు. వీడియోలో రాముడు, రావణుడి మధ్య యుద్ధం చూపించారు. రణ్‌బీర్, యష్ లుక్స్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో రామాయణం టీజర్ , ఫస్ట్ లుక్ ను వైరల్ చేస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సినిమాను వచ్చే ఏడాది, అంటే 2026 దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. ఇక రామాయణంలో రెండో భాగం సినిమాను 2027 దీపావళికి విడుదల అవుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్‌ ద్వారా అనౌన్స్ చేశారు.

నటీనటుల పారితోషికాలు

ఇక ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల కోసం దాదాపు 850 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణంలో సీతగా సాయి పల్లవి నటిస్తోంది. హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మెర్, ఏ.ఆర్.రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన రామాయణం ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో సినిమాపై అంచనాలు పెంచాయి.

సినిమా విడుదల తేదీలు

రామాయణం సినిమాలో నటించడానికి నటులకు భారీగా పారితోషికం ఇచ్చారు. యష్‌కి 200 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విలన్‌ పాత్రకు పారితోషికం ఇవ్వడం ఇదే మొదటిసారి. సాయి పల్లవికి ఒక్కో భాగానికి 15 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఆమె కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం. ఇక రణ్ బీర్ కపూర్ కూడా ఈసినిమా కోసం 60 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

రామాయణం సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ మరియు నటీనటులతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.