
సూర్య నటించిన ‘7th సెన్స్’ సినిమాలో విలన్‌గా మెప్పించిన జానీ ట్రింగ్యుయెన్ అలియాస్ డాంగ్లీ గుర్తుండిపోయారు. ఆయన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మారిపోయిన డాంగ్లీని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు.
Key Points
'7th సెన్స్' సినిమాలో సూర్యతో తలపడిన విలన్ డాంగ్లీ అసలు పేరు జానీ ట్రింగ్యుయెన్.
వియత్నాంలో పుట్టిన డాంగ్లీ మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన డాంగ్లీ వృద్ధాప్య ఛాయలతో మారిపోయినట్లు కనిపిస్తున్నాడు.
ఒకే ఒక్క సౌత్ సినిమాతో తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
‘7th సెన్స్’ విలన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?
డాంగ్లీ ఇప్పుడు ఎలా ఉన్నాడు?
పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన ‘7th సెన్స్’ చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.
ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్!
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.
డాంగ్లీ కేవలం ఒక్క సౌత్ సినిమాతోనే రెండు భాషల్లో తనదైన ముద్ర వేశారు. మార్షల్ ఆర్ట్స్ గురువుగా, నటుడిగా ఆయన ప్రస్థానం అభినందనీయం. ఆయన తాజా రూపం సినీ అభిమానులను ఆలోచింపజేస్తోంది.


