|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Guess The Actress: జెండా పట్టుకున్న ఈ పాప.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

Published: 16-08-2025, 7:48 AM
Guess The Actress: జెండా పట్టుకున్న ఈ పాప.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

తెలుగు తెరపై కర్ణాటక ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ తన నటనతో అలరిస్తోంది. నాగార్జున, చిరంజీవి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె సినిమా ప్రయాణం మరియు వ్యక్తిగత జీవితం గురించి ఇక్కడ చూద్దాం.

Key Points

1

కర్ణాటక ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం.

2

నాగార్జున, చిరంజీవి సినిమాల్లో నటించి మెప్పించిన ఆషిక.

4

చిన్నప్పుడు జెండా పట్టుకున్న ఆషిక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.

ఆషిక రంగనాథ్: కర్ణాటక నుంచి తెలుగు తెరకు

తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనగానే ముంబై నుంచి లేదంటే కేరళ కుట్టీలు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కర్ణాటక నుంచి ఈమె తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మొన్నటికి మొన్న నాగార్జునతో మూవీ చేసింది. ఇప్పుడు చిరంజీవితో చేస్తోంది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఆమెనే ఆషికా రంగనాథ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టింది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే 2014 టైంలోనే మిస్ ఫ్రెష్ ఫేస్ అనే అందాల పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. కానీ మహేశ్ బాబు అనే దర్శకుడి దృష్టిలో పడి, అతడు తీసిన ‘క్రేజీ బాయ్’ సినిమాతో హీరోయిన్‌గా మారింది.

2016 నుంచి సినిమాలు చేస్తున్న ఆషిక.. కన్నడ స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ చిత్రాల్లో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోకి కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది కానీ నటిగా ఈమెకు మంచి మార్క్స్ పడ్డాయి. నాగార్జునతో చేసిన ‘నా సామి రంగ’ కూడా ఈమెలో గ్లామర్, యాక్టర్‌ని అందరికీ పరిచయం చేసింది.

‘నా సామి రంగ’ నుంచి ‘విశ్వంభర’ వరకు

‘నా సామి రంగ’లో ఆషికని చూసిన ‘విశ్వంభర’ టీమ్.. తమ చిత్రంలో కీలక పాత్ర కోసం అవకాశమిచ్చింది. చిరు చేస్తున్న ‘విశ్వంభర’లో ఆషికా.. అతిలోక సుందరి తరహా పాత్ర చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగానూ ప్రకటించింది. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే గనక ఆషికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.

జెండా పట్టుకున్న చిన్నారి నుంచి స్టార్ హీరోయిన్ వరకు

ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన చిన్నప్పుడు జెండా పట్టుకుని దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు.. చిన్నప్పుడు ఆషిక ఇలా ఉందా? ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉందే అని మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికొస్తే.. కొన్ని నెలల క్రితం ఈమె అక్క అనుష పెళ్లి చేసుకుంది. మరి ఆషిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి?

చిన్నతనంలో జెండా పట్టుకున్న ఆషిక ఇప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘విశ్వంభర’ సినిమా ఆమెకు మరింత పేరు తెస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.