|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హీరోయిన్ వల్లే గుణశేఖర్ సినిమా ఫ్లాప్… సంచలన నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

Published: 26-01-2026, 2:05 AM
షాకింగ్: హీరోయిన్ వల్లే గుణశేఖర్ సినిమా ఫ్లాప్... సంచలన నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!
  • గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు: హీరోయిన్ వల్లే ‘వరుడు’ సినిమా ప్లాప్ అయిందన్న గుణశేఖర్.
  • ‘వరుడు’ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం, కానీ హీరోయిన్ ఎంపిక తప్పిదం అన్నారు.
  • ఫిబ్రవరి 6న యుఫోరియా విడుదల: సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ చిత్రం.
  • దర్శకుడు గుణశేఖర్ కెరీర్ లో ‘రుద్రమదేవి’ ఒక మైలురాయిగా నిలిచిందని వెల్లడి.

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ సంచలన విషయాలు వెల్లడించారు. ‘వరుడు’ సినిమా ప్లాప్ అవ్వడానికి గల కారణాలను వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు!

Gunashekar: టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో గుణేశేఖర్ ఒకరు. భారీ సెట్టింగులకి కేరాఫ్ గా ఉండేవాడు ఈ దర్శకుడు. ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత వరుస ప్లాప్స్ చేసి ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత గ్రాఫికల్ మూవీస్ గా రుద్రమదేవి, శాకుంతలం లాంటి సినిమాలు చేశాడు. వాటిలో రుద్రమదేవి పరవాలేదు అనిపించినా శాకుంతలం సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.

దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు యుఫొరియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు దర్శకుడు గుణశేఖర్(Gunashekar).

‘వరుడు’ సినిమా వెనుక అసలు నిజాలు

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ కెరీర్ లో బాగా డిజప్పాయింట్ చేసిన సినిమా ఏది అని అడిగారు. దానికి సమాధానంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో నన్ను బాగా డిజప్పాయింట్ చేసిన వరుడు. అల్లు అర్జున్ నేను చెప్పిన ఐదు రోజుల పెళ్లి, పీటలపైనే అమ్మాయిని చూడటం అనే పాయింట్ ని చాలా బాగా నమ్మాడు. కథ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. నిజానికి ఆ సినిమాలో యాక్షన్ వద్దు అనుకున్నాం. దానికి బన్నీ కూడా ఒప్పుకున్నాడు. కానీ, కొంతమంది చెప్పిన మాటలు విని యాక్షన్ యాడ్ చేయాల్సి వచ్చింది.

యుఫోరియా సినిమాతో గుణశేఖర్ రీఎంట్రీ!

ఇక, సినిమా ప్లాప్ అవడానికి ప్రధాన కారణం హీరోయిన్. ఆమెను సినిమాలో పీటీలమీదనే చూపించాలని ఎక్కడా రివీల్ చేయలేదు. దాంతో ప్రేక్షకులు అంచనాలు చాలా పేచేసుకున్నారు. కానీ, అమ్మయిని చూశాక ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అది సినిమాపై చాలా ఎఫెక్ట్ చూపించింది అంటూ చెప్పుకొచ్చాడు గుణశేఖర్. అలాగే, కథ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో గుణశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తదుపరి చిత్రం ‘యుఫోరియా’ ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.